అవనిగడ్డ జనసేన ఎమ్మెల్యే అభ్యర్థిగా మండలి బుద్ధ ప్రసాద్

by Malleboina Mahesh |   (  Updated:2024-04-04 13:26:53  IST  )

2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తనకు పొత్తులో వచ్చిన అన్ని సీట్లలో గెలుపే లక్ష్యంగా జనసేనాని పవన్ కల్యాణ్ ముందుకు సాగుతున్నారు.

అవనిగడ్డ జనసేన ఎమ్మెల్యే అభ్యర్థిగా మండలి బుద్ధ ప్రసాద్
X

దిశ, వెబ్‌డెస్క్: 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తనకు పొత్తులో వచ్చిన అన్ని సీట్లలో గెలుపే లక్ష్యంగా జనసేనాని పవన్ కల్యాణ్ ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలో అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన అభ్యర్థుల ఎంపిక కోసం ప్రత్యేక వ్యూహాలను అవలంబిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయా నియోజకవర్గాల అభ్యర్థుల ఎంపీను స్వయంగా పర్యవేక్షిస్తున్న పవన్ కళ్యాణ్.. తాజాగా అవనిగడ్డ అసెంబ్లీ జనసేన అభ్యర్థిగా మండలి బుద్ధ ప్రసాద్‌ను ప్రకటించారు. అలాగే పాలకొండ అసెంబ్లీ స్థానానికి కూడా రెండు రోజుల్లో అభ్యర్థిని నిర్ణయిస్తామని తెలిపారు.

రైల్వే కోడూరు అభ్యర్థి మార్పు పై కూడా సమాలోచనలు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ అసెంబ్లీ స్థానంలో ఇప్పటికే యనమల భాస్కర్ రావు పేరును ప్రకటింగా.. పలు సర్వేల్లో సానుకూలత లేకపోవడం, మిత్రపక్షమైన టీడీపీ నుంచి అనుకూలత లేకపోవడంతో అభ్యర్థి మార్పు పై నాయకుల అభిప్రాయాలను తెలుసుకుంటున్నామని.. కొద్ది గంటల్లో అభ్యర్థి మార్పు పై నిర్ణయం తీసుకుంటామని జనసేన ప్రకటించింది.

Read More..

అవనిగడ్డ జనసేన ఎమ్మెల్యే అభ్యర్థిగా మండలి బుద్ధ ప్రసాద్

Next Story