Manchu Manoj : యూనివర్సిటీలోకి వెళ్లేందుకు మంచు మనోజ్ యత్నం..అడ్డుకున్న సిబ్బంది

by Y. Venkata Narasimha Reddy |   ( Updated:2025-01-15 11:29:40.0  )
Manchu Manoj : యూనివర్సిటీలోకి వెళ్లేందుకు మంచు మనోజ్ యత్నం..అడ్డుకున్న సిబ్బంది
X

దిశ, వెబ్ డెస్క్ :సీనియర్ నటుడు, దర్శక, నిర్మాత మంచు మోహన్ బాబు(Mohan Babu) తిరుపతి (Tirupathi) యూనివర్సిటీ(University) వద్ద ఉద్రిక్తత (Tension) చోటు చేసుకుంది. మోహన్‌బాబు రెండో కుమారుడు మంచు మనోజ్ (Manchu Manoj) యూనివర్సిటీలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించగా..సెక్యురిటీ సిబ్బంది అడ్డుకున్నారు. అప్పటికే యూనివర్సిటీ లోపల మోహన్ బాబు, పెద్దకొడుకు మంచు విష్ణు(Manchu Vishnu)ఉన్నారు. మంచు కుటుంబంతో ఇటీవల చోటుచేసుకున్న వివాదాల నేపథ్యంలో మంచు మనోజ్ యూనివర్సిటీ లోపలికి వస్తే మళ్లీ గొడవ తలెత్తవచ్చన్న ఉద్దేశంతో సెక్యూరిటీ సిబ్బంది వారిని లోనికి అనుమతించలేదు.

తాను గొడవ చేసేందుకు రాలేదని వర్సిటీ ఆవరణలో ఉన్న తాత నారాయణస్వామి నాయుడు, నానమ్మ లక్ష్మమ్మల సమాధుల వద్ధ నివాళులు అర్పించేందుకు వచ్చానని మనోజ్ వాదించినప్పటికి సెక్యురిటీ సిబ్బంది పట్టించుకోలేదు. దీంతో వారితో ఆయన వాగ్వివాదానికి దిగాడు. గేటు ముందు మంచు మనోజ్ ఆందోళనకు దిగాడు. గేటు లోపల ఉన్న వ్యక్తిని ఓరేయ్ ‘ఎలుగుబంటి’.. గేట్ తీయ్ అని మనోజ్ డిమాండ్ చేశారు. పరిస్థితి అదుపు తప్పకుండా స్థానిక పోలీసులు కూడా అక్కడే మోహరించారు. ఇదే క్రమంలో మోహన్ బాబు బౌన్సర్లకు, మనోజ్ బౌన్సర్లకు మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు.

మా తాత..నానమ్మ సమాధులను సందర్శించేందుకు అనుమతి ఎందుకని.. అవసరమైతే ఎస్పీ దగ్గర పర్మిషన్ తీసుకుంటా కాని..నేను వెనక్కి వెళ్లనని, దమ్ముంటే అరెస్టు చేసుకోండి అంటూ మనోజ్ పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. మోహన్ బాబు ఇంజక్షన్ ఆర్డర్ కాపీ నాకు చేరలేదని..మీ పోలీసుల నోటీసులు అందాయన్నారు. అయితే నేను తాత, నాయనమ్మ సమాధులను సందర్శించి హైదరాబాద్ కు వెళ్లిపోతాననని..సమాధుల వద్దకు మీరు నన్ను తీసుకెళ్లినా సరేనని మనోజ్ స్పష్టం చేశారు.

అంతకు ముందు మనోజ్ మౌనిక దంపతులు రేణిగుంట విమానాశ్రయం నుంచి ర్యాలీగా రంగంపేటకు చేరుకున్నారు. నారావారి పల్లెకు చేరుకుని మంత్రి నారా లోకేష్ తో భేటీ అనంతరం..రంగంపేటలో ప్రారంభమైన జల్లికట్టు పోటీలకు హాజరయ్యారు. అనంతరం యూనివర్సిటీ వద్ధకు చేరుకున్నారు. మనోజ్ రాకకు సంబంధించి ముందస్తు సమాచారం ఉండటంతో యూనివర్సిటీ గేట్లు మూసి వేసి.. పరిసర ప్రాంతాలకు ఎవరినీ అనుమతించ లేదు. మీడియాను కూడా అక్కడ నుంచి వెళ్లిపోవాలని భద్రతా సిబ్బంది ఆదేశించారు. సమాచారం అందుకున్న పోలీసులు (Police) కూడా యూనివర్సిటీ వద్దకు చేరుకున్నారు. శాంతి భద్రతల దృష్ట్యా మోహన్ బాబు యూనివర్సిటీలోకి అనుమతి లేదని పోలీసులు మనోజ్ కు ముందస్తుగా నోటీసులు జారీ చేశారు.

Read More : Manchu Manoj: భార్యాపిల్లలతో కలిసి మెగా హీరోలతో సంక్రాంతి సెలబ్రేషన్స్ జరుపుకున్న మంచు హీరో.. కారణమేంటి?

Advertisement

Next Story