సత్యసాయి జిల్లాలో వ్యక్తి దారుణహత్య.. పాపం ఆ ముగ్గురు పిల్లలు

by Naga Rani Yarlagadda |

శ్రీసత్యసాయి జిల్లాలో వ్యక్తి దారుణహత్యకు గురయ్యాడు. కదిరి మండలం బండవాండ్లపల్లికి చెందిన నవీన్ (35)గ్రామ శివారులో దారుణ హత్యకు గురవ్వగా..

సత్యసాయి జిల్లాలో వ్యక్తి దారుణహత్య.. పాపం ఆ ముగ్గురు పిల్లలు
X

దిశ, వెబ్‌డెస్క్: శ్రీసత్యసాయి జిల్లాలో వ్యక్తి దారుణహత్యకు గురయ్యాడు. కదిరి మండలం బండవాండ్లపల్లికి చెందిన నవీన్ (35)గ్రామ శివారులో దారుణ హత్యకు గురవ్వగా.. గ్రామస్తులు చూసి పోలీసులకు సమాచారమిచ్చారు. ఈ ఘటనపై గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. శుక్రవారం తెల్లవారుజామున బహిర్భూమికి వెళ్లిన నవీన్ ను గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో పొడిచి హతమార్చారు.

నవీన్ భార్య రెండేళ్ల క్రితం ఆత్మహత్య చేసుకుంది. ఇప్పుడు నవీన్ కూడా హత్యకు గురికావడంతో వారి ముగ్గురు పిల్లలు అనాథలయ్యారు. నవీన్ హత్యకు వివాహేతర సంబంధమే ప్రధాన కారణమై ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఘటనా ప్రాంతాన్ని పరిశీలించిన సీఐ నిరంజన్ రెడ్డి.. దీనిపై కుటుంబ సభ్యుల నుంచి ఫిర్యాదు స్వీకరించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Next Story