పోలీసుల కళ్లెదుటే దారుణం.. కారుతో ఢీకొట్టి వ్యక్తి హత్య

by Vemula.Srinu Prasad |

పోలీసుల కళ్లెదుటే దారుణం జరిగింది. పాతకక్షల నేపథ్యంలో క్రాంతి కిరణ్ అనే వ్యక్తి బైక్‌పై వెళ్తుండగా రామినేని రామకృష్ణ కారుతో వేగంగా వెళ్లి ఢీకొట్టారు....

పోలీసుల కళ్లెదుటే దారుణం.. కారుతో ఢీకొట్టి వ్యక్తి హత్య
X

దిశ, వెబ్ డెస్క్: పోలీసుల కళ్లెదుటే దారుణం జరిగింది. పాతకక్షల నేపథ్యంలో క్రాంతి కిరణ్ అనే వ్యక్తి బైక్ పై వెళ్తుండగా రామినేని రామకృష్ణ కారుతో వేగంగా వెళ్లి ఢీకొట్టారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన కిరణ్ అక్కడికక్కడే మరణించారు. ఈ ఘోరం పోలీసుల ఎదుటే జరగడంతో స్థానికులు విస్మయానికి గురయ్యారు. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం హనుమాన్ జంక్షన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. పాత గొడవలే కిరణ్ హత్యకు కారణమని ప్రాథమికంగా పోలీసులు నిర్ధారించారు. కిరణ్ మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story