కీసర టోల్ ప్లాజా ఘోరం.. సిమెంట్ లారీ పడటంతో కారులో ఉన్న వ్యక్తి స్పాట్‌డెడ్

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-04-11 13:00:38  IST  )

టోల్ ప్లాజా వద్ద కారుపై బోల్తా పడిన సిమెంట్ ట్యాంకర్‌ను అతికష్టం మీద హైరిస్క్ ఆపరేషన్ ద్వారా పక్కకు తొలగించారు. డ్రైవర్ సీట్లో ఒకరు మాత్రమే ఉన్నట్లు గుర్తించారు...

కీసర టోల్ ప్లాజా ఘోరం..  సిమెంట్ లారీ పడటంతో కారులో ఉన్న వ్యక్తి స్పాట్‌డెడ్
X

దిశ, వెబ్ డెస్క్: కృష్ణా జిల్లా టోల్ ప్లాజా వద్ద జరిగిన ఘోర ప్రమాదంలో నుజ్జు నుజ్జైన బీఎమ్ డబ్ల్యూ కారు హైదరాబాద్ ఎల్లారెడ్డికి చెందిన అడ్వకేట్ బి. శ్రీనివాసరావుదిగా గుర్తించారు. ఓ అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న ఆయన వారం క్రితం భార్య, కుమార్తెతో కలిసి విజయవాడ వెళ్లినట్లు వాచ్ మెన్ ద్వారా వెల్లడైంది. శ్రీనివాసరావు కారుకు యాక్సిడెంట్ అయిందని, తమకు సమాచారం అందిందని ఆయన స్పష్టం చేశారు.

ప్రస్తుతం టోల్ ప్లాజా వద్ద కారుపై బోల్తా పడిన సిమెంట్ ట్యాంకర్‌ను అతికష్టం మీద హైరిస్క్ ఆపరేషన్ ద్వారా పక్కకు తొలగించారు. డ్రైవర్ సీట్లో ఒకరు మాత్రమే ఉన్నట్లు గుర్తించారు. ప్రమాదం జరిగిన సమయంలోనే ఆయన మృతి చెందారు. టోల్ ప్లాజా వద్దకు అతివేగంగా లారీ రావడంతో పాటు డివైడర్‌ను ఢీకొట్టడంతో పక్కనే ఉన్న కారుపై పడినట్లు స్థానికులు తెలిపారు.

Next Story