పాము కాటేసిందని దాని తలనే కొరికేసిన వ్యక్తి.. రాత్రంతా పక్కనే పెట్టుకుని..

by Naga Rani Yarlagadda |

పామును ఆమడదూరంలో చూస్తేనే.. కిలోమీటర్ దూరం పరుగులు పెడతాం. అది కాటు వేస్తే.. ప్రాణమే పోతుందన్న విషయం మనందరికీ తెలుసు.

పాము కాటేసిందని దాని తలనే కొరికేసిన వ్యక్తి.. రాత్రంతా పక్కనే పెట్టుకుని..
X

దిశ, వెబ్‌డెస్క్: పామును ఆమడదూరంలో చూస్తేనే.. కిలోమీటర్ దూరం పరుగులు పెడతాం. అది కాటు వేస్తే.. ప్రాణమే పోతుందన్న విషయం మనందరికీ తెలుసు. పాము విషానికి అంత పవర్ ఉంటుంది. అలాంటి పాము తలను కొరికి.. రాత్రంతా దానిని పక్కన పెట్టుకుని నిద్రపోయాడో వ్యక్తి. ఒళ్లు జలదరించే ఈ సంఘటన తిరుపతి జిల్లా తొట్టంబేడు మండలం చియ్యవరంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. నిన్న (గురువారం) రాత్రి మద్యం తాగి ఇంటికి వెళ్తున్న వెంకటేశ్ అనే వ్యక్తిని దారిమధ్యలో నల్లత్రాచు పాము కాటేసింది. దాంతో వెంకటేశ్.. నన్నే కాటేస్తావా అంటూ పామును పట్టుకుని దాని తలను కొరికేశాడు. ఆపై చనిపోయిన పామును ఇంటికి తీసుకెళ్లి తన పక్కనే పెట్టుకుని నిద్రపోయాడు.

అర్థరాత్రి తర్వాత వెంకటేశ్ ఆరోగ్య పరిస్థితిలో మార్పు రావడంతో శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. అక్కడ వైద్యులు పరిస్థితి విషమంగా ఉందని చెప్పడంతో.. శుక్రవారం ఉదయం తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వెంకటేశ్ కు రుయా ఆస్పత్రిలో ట్రీట్మెంట్ జరుగుతోంది.

Next Story