ఆక్వా రైతులకు భారీ ఊరట.. కిలో ఫీడ్‌పై రూ.4 తగ్గిస్తూ కంపెనీల నిర్ణయం

by Kema Shiva Kumar |

ఆంధ్రప్రదేశ్‌లోని ఆక్వా రైతులకు భారీ ఊరట లభించింది.

ఆక్వా రైతులకు భారీ ఊరట.. కిలో ఫీడ్‌పై రూ.4 తగ్గిస్తూ కంపెనీల నిర్ణయం
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో ఆక్వా రైతులకు సీఎం చంద్రబాబు (CM Chandrababu) భారీ ఉపశమనం కలిగించారు. ఇవాళ సచివాలయంలో ఆక్వా రైతులు (Aqua Farmers), ఆక్వా ఫీడ్ తయారీ కంపెనీల ప్రతినిధులతో ఆయన ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆక్వా రంగం ఎదుర్కొంటున్న సమస్యలపై వారితో సీఎం సుదీర్ఘంగా చర్చించారు. ప్రస్తుతం పెరిగిన పెట్టుబడి ఖర్చులతో ఇబ్బందులు పడుతున్న రైతులకు అండగా నిలవాలని సీఎం ఈ భేటీలో కంపెనీల ప్రతినిధులను కోరారు.

అయితే, సీఎం చంద్రబాబు చేసిన సూచనలు, ఆక్వా రంగాన్ని ఆదుకోవాల్సిన ఆవశ్యకతను వివరించిన తీరుకు ఫీడ్ తయారీ కంపెనీలు సానుకూలంగా స్పందించాయి. రైతులకు భారం తగ్గించేందుకు గానూ ఆక్వా ఫీడ్ (Aqua Feed) ధరలను తగ్గించేందుకు కంపెనీల ప్రతినిధులు ఒకే చెప్పారు. ఈ మేరకు ఆక్వా ఫీడ్‌ ధరను కిలోకు రూ.4 చొప్పున తగ్గించేందుకు కంపెనీలు అంగీకారం తెలిపాయి. తాజా ధరల తగ్గింపు నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది రొయ్యలు, చేపల పెంపకం రైతులకు పెద్ద ఎత్తున ఆర్థిక లబ్ధి చేకూరనుంది. ప్రతి కిలోపై రూ.4 తగ్గడం వల్ల టన్నుల కొద్దీ మేత వాడే ఆక్వా సాగులో పెట్టుబడి ఖర్చులు గణనీయంగా తగ్గుతాయని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Next Story