- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
'కోడి చెరువు' కబ్జా వ్యవహారం: పవన్ కల్యాణ్‌కు భారీ ఊరట
కూటమి పార్టీలపై ఇటీవల ప్రొఫెసర్ నాగేశ్వరరావు వ్యాఖ్యలతో చెలరేగిన రాజకీయ దుమారంతో ఏపీ, తెలంగాణ మధ్య ప్రాంతీయ విద్వేషాలు భగ్గుమన్నాయి. దీంతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై కొందమంది తెలంగాణ వాదులు తీవ్ర స్థాయిలో విరుచుపడ్డారు....

దిశ, వెబ్ డెస్క్: కూటమి పార్టీలపై ఇటీవల ప్రొఫెసర్ నాగేశ్వరరావు వ్యాఖ్యలతో చెలరేగిన రాజకీయ దుమారంతో ఏపీ, తెలంగాణ మధ్య ప్రాంతీయ విద్వేషాలు భగ్గుమన్నాయి. దీంతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై కొందమంది తెలంగాణ వాదులు తీవ్ర స్థాయిలో విరుచుపడ్డారు. ఇష్టమొచ్చినట్లు మండిపడ్డారు. అలాగే ఆయన కొనుగోలు చేసిన హైదరాబాద్ జనవాడ వ్యవసాయ క్షేత్రంపై తీవ్ర ఆరోపణలు చేశారు. పవన్ కొనుగోలు చేసిన భూములు కోడి చెరువుకు సంబంధించినవంటూ కొంతమంది యూట్యూబ్ ఛానల్ జర్నలిస్టులు ఆరోపించారు. అంతేకాదు ఆ ప్రాంతానికి వెళ్లి హంగామా చేశారు. కోడి చెరువును పవన్ కల్యాణ్ కబ్జా చేశారని విమర్శలు చేశారు. అలాగే సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేశారు. అవి కొనుగోలు చేసిన స్థలం అని జనసేన పార్టీ నేతలు స్పష్టత ఇచ్చినా కోడి చెరువును పవన్ కల్యాణ్ కబ్జా చేశారనే ప్రచారం బాగా విపరీతంగా జరిగింది. ఎక్స్‌తో పాటు ఫేస్ బుక్‌లోనూ పవన్ కల్యాణ్‌కు వ్యతిరేకంగా పోస్టులు, పిక్‌లు, ట్వీట్లతో రచ్చ జరిగింది.
బెంగళూరు కోర్టులో ఊరట
దీంతో జనసేన నేతలు బెంగళూరు కోర్టును ఆశ్రయించారు. తెలంగాణలోని ‘కోడి చెరువు’ భూముల వ్యవహారంలో పవన్ కల్యాణ్ ప్రతిష్టకు భంగం కలిగించేలా ఉన్న కంటెంట్ సోషల్ మీడియాల నుంచి తక్షణమే తొలగించాంటూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన ధర్మాసనం... ఆ కంటెంట్ల మొత్తాన్ని తొలగించాలంటూ ఎక్స్, గూగుల్, మెటా సంస్థలకు బెంగళూరు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ జులై 24కి వాయిదా వేసింది.






