- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హైవేపై ప్రమాదం.. కార్బన్ డయాక్సైడ్ లోడ్ లారీ దగ్ధం
అతివేగంగా వచ్చిన వాహనం నియంత్రణ కోల్పోయి డివైడర్‌ను దాటి, అవతలి వైపు వెళ్తున్న కార్బన్ డయాక్సైడ్ లోడ్ లారీని ఢీ కొట్టింది.

దిశ, వెబ్‌డెస్క్: కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం చిన్నంపేట వద్ద జాతీయ రహదారిపై శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అతివేగంగా ప్రయాణిస్తున్న ఒక వాహనం నియంత్రణ కోల్పోయి డివైడర్‌ను దాటి, అవతలి వైపు వెళ్తున్న కార్బన్ డయాక్సైడ్ లోడ్ లారీని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద ధాటికి లారీలో ఒక్కసారిగా మంటలు చెలరేగి, వాహనం పూర్తిగా దగ్ధమైంది. లారీలో మంటలు వ్యాపించిన వెంటనే అప్రమత్తమైన డ్రైవర్లు వాహనం నుంచి కిందకు దూకేయడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రాణాపాయం నుంచి వారు సురక్షితంగా బయటపడ్డారు. ఈ లారీ విశాఖపట్నం నుంచి మహారాష్ట్రకు కార్బన్ డయాక్సైడ్ సిలిండర్ల లోడ్‌తో వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లు పోలీసులు గుర్తించారు.
జాతీయ రహదారిపై లారీ మంటల్లో చిక్కుకోవడంతో దట్టంగా పొగలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. రసాయన గ్యాస్ లోడ్ కావడంతో చుట్టుపక్కల ప్రాంత ప్రజలు కాసేపు ఆందోళనకు గురయ్యారు. ప్రమాదం కారణంగా జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోవడంతో పోలీసులు రంగంలోకి దిగి వాహనాలను మళ్లించి, ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. అతివేగమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.






