- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
40 పూరిళ్లు దగ్ధం..గ్యాస్ లీకే కారణమంటూ అనుమానాలు ?
కాకినాడ పరిధి మన్యం గ్రామం సార్లంకపల్లెలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది.

దిశ, వెబ్ డెస్క్: రెండు తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి మొదలైంది. పట్నం నుంచి పల్లెలకు జనాలు చేరుకుంటున్నారు. ఇలాంటి నేపథ్యంలో ఏపీలో పెను విషాదం చోటు చేసుకుంది. అగ్ని ప్రమాదం కారణంగా ఏకంగా 40 కుటుంబాలకు గుండెపోత మిగిలింది. సంక్రాంతి పండుగ వేళ, ఊరంతా కట్టు బట్టలతో రోడ్డుపైకి రావాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. కాకినాడ పరిధి మన్యం గ్రామం సార్లంకపల్లెలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది.
ఈ చిన్న తండాలో ఉన్న 40 పూరిళ్లు పూర్తిగా దగ్ధం అయ్యాయి. దీంతో ఈ గ్రామానికి చెందిన మొత్తం 120 మంది రోడ్డున పడ్డారు. ఈ తండాలో మూడు మాత్రమే పక్కా ఇండ్లు ఉన్నాయి. ఆ మూడు ఇండ్లు మినహా అన్ని పూరిళ్లు దగ్ధమయ్యాయని చెబుతున్నారు. పండుగ సరుకుల కోసం తునికి గ్రామస్తులందరూ వెళ్లారు. అయితే తుని నుంచి తిరిగి వచ్చేసరికి ఊరు మొత్తం కాలిబూడిదైందని సమాచారం. గ్యాస్ లీక్ అయి మంటలు వ్యాపించినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.






