- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కర్నూలులో భారీ అగ్నిప్రమాదం: కూలర్ల గోదాంలో ఎగిసిపడ్డ మంటలు
కర్నూలు నగరంలోని బాలాజీ నగర్‌లో మంగళవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది.

దిశ, డైనమిక్ బ్యూరో: కర్నూలు నగరంలోని బాలాజీ నగర్‌లో మంగళవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఒక కూలర్ల తయారీ గోదాంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో ఆస్తి నష్టం వాటిల్లింది. ప్లాస్టిక్ సామగ్రి అధికంగా ఉండటం, దానికి తోడు గ్యాస్ సిలిండర్లు పేలడంతో మంటలు క్షణాల్లోనే గోదాం మొత్తానికి వ్యాపించాయి. ఘటన వివరాల్లోకి వెళితే.. బాలాజీ నగర్‌లోని సదరు గోదాంలో విక్రయాల కోసం భారీగా కూలర్లు, వాటికి సంబంధించిన ప్లాస్టిక్ బాడీలను నిల్వ ఉంచారు. మంగళవారం మధ్యాహ్నం సమయంలో గోదాంలో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో చుట్టుపక్కల నివాసం ఉంటున్న ప్రజలు ప్రాణభయంతో రోడ్లపైకి పరుగులు తీశారు. గోదాం నుంచి భారీగా నల్లటి పొగ అలుముకోవడంతో స్థానికులు ఊపిరి ఆడక ఇబ్బంది పడ్డారు. కాలనీ అంతా భయానక వాతావరణం నెలకొంది.
భారీ ఆస్తి నష్టం - తృటిలో తప్పిన ప్రాణాపాయం
ఈ ప్రమాదంలో గోదాంలో నిల్వ ఉంచిన లక్షలాది రూపాయల విలువైన కొత్త కూలర్లు, విడిభాగాలు, తయారీ యంత్రాలు పూర్తిగా కాలి బూడిదైనట్లు తెలుస్తోంది. అయితే, ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని ప్రాథమిక సమాచారం ద్వారా తెలుస్తోంది. ఇక, సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమించారు. అగ్నిప్రమాదానికి గ్యాస్ సిలిండర్లు పేలడమే ప్రధాన కారణమని అధికారులు భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.






