- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పొగాకు పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం.. కోట్లలో ఆస్తి నష్టం
పొగాకు పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకొని పరిసర ప్రాంతాలు పూర్తిగా దట్టమైన పొగతో కమ్ముకొని పోయాయి.

దిశ, వెబ్ డెస్క్: పొగాకు పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం (Massive fire) చోటు చేసుకొని పరిసర ప్రాంతాలు పూర్తిగా దట్టమైన పొగతో కమ్ముకొని పోయాయి. ఈ షాకింగ్ ఘటన ఈ రోజు ప్రకాశం జిల్లాలోని సింగరాయకొండ మండల పరిధిలోని బెల్లం కోటయ్య పొగాకు పరిశ్రమ (bellam Kotaiah tobacco factory)లో చోటు చేసుకుంది. తెల్లవారుజామున ఫ్యాక్టరీ నుంచి ఉన్నట్టుండి దట్టమైన పొగతో మంటలు చెలరేగడం గమనించిన స్థానికులు వెంటనే పోలీసులు, ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది.. మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
అయితే ఇటీవల పంటలు చేతికి రావడం తో పెద్ద మొత్తంలో పరిశ్రమలో పొగాకు నిల్వ (Tobacco storage) ఉంచారు. దీంతో ఫైర్ సిబ్బంది (Fire crew) మంటలను అదుపు చేసేందుకు ఎంత ప్రయత్నించినప్పటికీ.. భారీగా మంటలు ఎగిసి పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ అగ్ని ప్రమాదం షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగినట్లు అంతా భావిస్తున్నారు. అలాగే దాదాపు 300 కోట్ల ఆస్తి నష్టం జరిగి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ భారీ అగ్ని ప్రమాదానికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.






