YS జగన్ తెనాలి పర్యటనలో మహేష్ బాబు ఫ్లెక్సీలు !

by velandi.Saikiran |   (  Updated:2025-08-15 11:57:50  IST  )

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ( AP) రాజకీయాలు చాలా రసవత్తరంగా కొనసాగుతున్నాయి. మొన్నటి వరకు వైసిపి నేతల ( YCP Leaders)

YS జగన్ తెనాలి పర్యటనలో మహేష్ బాబు ఫ్లెక్సీలు !
X

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ( AP) రాజకీయాలు చాలా రసవత్తరంగా కొనసాగుతున్నాయి. మొన్నటి వరకు వైసిపి నేతల ( YCP Leaders) వరుస అరెస్టులు జరగగా... ఇప్పుడు తెనాలి సంఘటన హాట్ టాపిక్ గా మారింది. ముగ్గురు కుర్రాళ్లను పోలీసులు కొట్టిన నేపథ్యంలో... స్వయంగా రంగంలోకి వైయస్ జగన్మోహన్ రెడ్డి దిగారు. ఇందులో భాగంగానే తెనాలి ఘటనలో..బాధిత కుటుంబాన్ని తాజాగా పరామర్శించారు వైయస్ జగన్మోహన్ రెడ్డి.

ఇందులో భాగంగానే తన నివాసం నుంచి ఇవాళ తెనాలి ( Tenali) పర్యటనకు వెళ్లారు. ఈ సందర్భంగా వైయస్ జగన్మోహన్ రెడ్డికి ( Ys Jagan) భారీ స్వాగతం లభించింది. ఈ నేపథ్యంలోనే... బాధిత జాన్ విక్టర్ కుటుంబాన్ని వైయస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు. ఈ సంఘటనకు సంబంధించిన కారణాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వైయస్ జగన్మోహన్ రెడ్డి ఓ రేంజ్ లో రెచ్చిపోయి.. కూటమి ప్రభుత్వాన్ని విమర్శించారు.

ఆ కుర్రాళ్లను తాను వెనకేసుకు రావడం లేదు కానీ... తప్పు చేస్తే శిక్షించాల్సిన పద్ధతి అది కాదు అంటూ చురకలాంటించారు. అయితే వైయస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్న నేపథ్యంలో... వైసీపీ అభిమానులు కొంతమంది.. మహేష్ బాబు ఫ్లెక్సీలను... చూపిస్తూ హల్చల్ చేశారు. జగన్మోహన్ రెడ్డి పక్కన మహేష్ బాబు ఫోటోను పెట్టి... జై జగన్ అంటూ ఆ ఫ్లెక్సీలను చూపించారు. దీనికి సంబంధించిన వీడియో అలాగే ఫోటోలు వైరల్ గా మారాయి.

Next Story