ఎంపీ చొరవ.. కొండవీడు కోటకు మహర్దశ

by Vemula.Srinu Prasad |

న్యూఢిల్లీలో కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని పల్నాడు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కలిశారు. రోడ్డు కనెక్టివిటీని మరింత మెరుగుపరచాలని ఆయన విజ్ఞప్తి చేశారు....

ఎంపీ చొరవ.. కొండవీడు కోటకు మహర్దశ
X

దిశ, వెబ్ డెస్క్: న్యూఢిల్లీ(New Delhi)లో కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ(Union Minsiter Nithin Gadkari)ని పల్నాడు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు(Palnadu MP Lavu Srikrishna Devaraya) కలిశారు. చారిత్రాత్మక కొండవీడు కోట(Kondaveedu Fort)కు రోడ్డు కనెక్టివిటీని మరింత మెరుగుపరచాలని ఆయన విజ్ఞప్తి చేశారు. పల్నాడు ప్రాంత సంస్కృతీ సంప్రదాయాలకు, ఘనమైన చరిత్రకు కొండవీడు కోట ఒక గర్వకారణమైన చిహ్నంగా నిలుస్తోందని వివరించారు. ఏపీలోనే ఇది ఒక ప్రముఖ పర్యాటక ప్రాంతంగా ఎదిగేందుకు అన్ని అర్హతలూ, అపారమైన అవకాశాలూ ఉన్నాయని కేంద్రమంత్రి దృష్టికి ఎంపీ తీసుకెళ్లారు. కోటకు చేరుకునే మార్గాలను సులభతరం చేయడం, పర్యాటకాన్ని ప్రోత్సహించడం, అలాగే ఈ ప్రాంతం సర్వతోముఖాభివృద్ధి చెందేలా చూడటం కోసం.. జాతీయ రహదారి-16 (NH-16), జాతీయ రహదారి-544D (NH-544D)ల నుండి కొండవీడు కోటను కలుపుతూ రెండు 4-లేన్ల స్పుర్ రోడ్లను నిర్మించాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కోరారు.

ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు ట్వీట్...

Next Story