Union Budget 2025 : ఏటికొప్పాక బొమ్మలకు మహర్దశ.. కేంద్ర ఆర్థిక మంత్రి కీలక ప్రకటన

by Jakkula.Mamatha |   (  Updated:2025-02-01 08:37:46  IST  )

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు(శనివారం)(Union Minister Nirmala Sitharaman) 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్(Union budget 2025:) ను పార్లమెంట్ లో ప్రవేశ పెట్టారు.

Union Budget 2025 : ఏటికొప్పాక బొమ్మలకు మహర్దశ.. కేంద్ర ఆర్థిక మంత్రి కీలక ప్రకటన
X

దిశ, వెబ్ డెస్క్: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు(శనివారం)(Union Minister Nirmala Sitharaman) 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్(Union budget 2025:) ను పార్లమెంట్ లో ప్రవేశ పెట్టారు. అయితే ఎనిమిదవసారి ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్‌లో(budget) కేంద్రం ప‌లు కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంది. ఇటీవల గణతంత్ర దినోత్సవ(Republic Day) సందర్భంగా రిపబ్లిక్ పరేడ్‌(Republic Pared)లో యావత్ దేశాన్ని ఆకర్షించిన ఏటికొప్పాక శకటం మూడో స్థానంలో నిలిచి జాతీయ స్థాయి(National Leval)లో పేరు తెచ్చుకున్న విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఏటికొప్పాక బొమ్మలకు మహర్దశ రానున్నట్లు తెలుస్తోంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ఇవాళ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ ను ఏటికొప్పాక బొమ్మల ప్రాధాన్యతను గురించి చెప్పారు. ఈ క్రమంలో కేంద్రం ప్రవేశపెట్టనున్న ‘తోలు పథకం’ ద్వారా 22 లక్షల మందికి ఉపాధి లభించనుంది. బొమ్మల కోసం జాతీయ ప్రణాళిక రూపకల్పన చేశామన్నారు. ‘‘మేక్ ఇన్ ఇండియా’’ను మరింత ప్రోత్సహించేందుకు చిన్న, మధ్యతరహా, పెద్ద పరిశ్రమలను కలుపుకొని ప్రభుత్వం జాతీయ తయారీ మిషన్‌ను ఏర్పాటు చేస్తుందని కేంద్ర మంత్రి నిర్మాల సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు.

ఇందులో భాగంగా.. భారతదేశాన్ని(India) టాయ్స్ హబ్ గా మార్చేందుకు ప్రభుత్వ పథకాన్ని ప్రారంభించనున్నట్లు చెప్పారు. వచ్చే 5 సంవత్సరాలకు టర్మ్ లోన్‌ల కోసం 5 లక్షల మంది మహిళలతో పాటు, మొదటిసారి వ్యాపారం చేయాలనుకునే వారి కోసం కొత్త పథకం ప్రారంభిస్తామని తెలిపారు. స్టార్టప్‌ల కోసం క్రెడిట్ గ్యారెంటీ పథకాన్ని రూ.20 కోట్లకు పెంచినట్లు నిర్మాల సీతారామన్(Nirmala Sitharaman) ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)కు ప్రత్యేకత తీసుకొచ్చే కళాకృతుల్లో ఏటికొప్పాక బొమ్మలకు ప్రత్యేక స్థానం ఉంది. ప్రస్తుతం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మాల సీతారామన్ ప్రకటనతో ఇప్పుడు ఆ విలువ మరింత పెరగనుంది.

Next Story