- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏపీ డిప్యూటీ సీఎంకు మహారాష్ట్ర సర్కార్ ఘన స్వాగతం
నేడు గురు తేగ్ బహదూర్ సింగ్ 350వ షహీదీ సమాగమం.

దిశ, వెబ్ డెస్క్ : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) మహారాష్ట్రంలోని నాందేడ్ (Nanded) కు చేరుకున్నారు. ప్రముఖ సిక్కు గురువు గురు తేగ్ బహదూర్ సింగ్ 350వ షహీదీ సమాగమంలో (Shahidi Samagam) పాల్గొనేందుకు నాందేడ్ కు ఆయన విచ్చేశారు. ఈ సందర్భంగా మహారాష్ట్ర ప్రభుత్వం ఆయనకు ప్రభుత్వ అతిథి (Government Guest) హోదాలో ఘన స్వాగతం పలికింది. నాందేడ్ లోని గురు గోవింద్ సింగ్ విమానాశ్రయంలో మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, రాజ్యసభ సభ్యుడు అశోక్ చవాన్, భోకార్ ఎమ్మెల్యే జయ చవాన్, ఎమ్మెల్సీ రాజార్ కర్, జిల్లా కలెక్టర్ రాహుల్ ఖరడ్లే తదితరులు సాదరంగా స్వాగతించారు. పవన్ కళ్యాన్ రాకతో విమానాశ్రయం వద్ద కాసేపు కోలాహలం నెలకొంది.
విమానాశ్రయం నుంచి ఆయన తను బస చేయాల్సిన చోటుకు చేరుకున్నారు. అక్కడ నాందేడ్ జిల్లా ఇన్ చార్జ్ మంత్రి అజిత్ సావే, రాజ్యసభ సభ్యుడు అజిత్ గోప్ చడే, ఆర్ఎస్ఎస్ ప్రముఖులు రాజేంద్ర కోడగే తదితరులు స్వాగత మర్యాదలు చేశారు. మధ్యాహ్నం 2 గంటల 10 నిమిషాలకు గురు తేగ్ బహదూర్ సాహిబ్ జీ (Guru Teg Bahadur sahib Ji) 350వ షహీదీ సమాగమానికి డిప్యూటీ సీఎం హాజరవుతారు. సాయంత్రం 4 గంటలకు మోదీ మైదాన్ లో నిర్వహించే దర్బార్ కార్యక్రమంలో పాల్గొంటారు. కార్యక్రమ అనంతరం సాయంత్రం 4.30 గంటలకు తిరుగు ప్రయాణం అవుతారు. బేగంపేటకు ఎయిర్ పోర్టుకు చేరుకొని జూబ్లీహిల్స్ లోని తన నివాసానికి వెళ్తారు. సుమారు 10 లక్షల మంది భక్తులు కార్యక్రమానికి హాజరు కానున్నారని సమాచారం. ఇంత పెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రభుత్వ అతిథిగా హాజరు కావడం పట్ల జనసేన శ్రేణుల్లో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.
READ MORE ....






