తిరుమలలో మహాపచారం.. కాంట్రాక్ట్ సిబ్బంది మాంసాహార భోజనం

by Kema Shiva Kumar |

పరమ పవిత్రమైన శ్రీ వేంకటేశ్వర స్వామి వారి పాదాల చెంత మరోసారి మహాపచారం చోటుచేసుకుంది.

తిరుమలలో మహాపచారం.. కాంట్రాక్ట్ సిబ్బంది మాంసాహార భోజనం
X

దిశ, వెబ్‌డెస్క్: పరమ పవిత్రమైన శ్రీ వేంకటేశ్వర స్వామి వారి పాదాల చెంత మరోసారి మహాపచారం చోటుచేసుకుంది. తిరుమల (Tirumala)కు వెళ్లే పవిత్రమైన మెట్ల మార్గంలో (అలిపిరి–తిరుమల దారిలో) టీటీడీ (TTD) కాంట్రాక్ట్ సిబ్బంది మాంసాహార భోజనం చేసిన ఘటన భక్తులను తీవ్ర ఆగ్రహానికి గురిచేసింది. భక్తుల సమాచారం మేరకు, కొంతమంది సిబ్బంది మెట్ల మార్గంలో కూర్చొని మాంసాహారం తింటున్నారు. ఆ చిత్రం చూసిన అటుగ వెళ్తున్న భక్తులు స్వామి వారి చెంత మాంసాహారం తినొచ్చా అని వారిని ప్రశ్నించారు. అయితే, చేసింది తప్పని ఒప్పుకోకుండా సదరు కాంట్రాక్ట్ సిబ్బంది భక్తుల పట్ల అగౌరవంగా మాట్లాడుతూ బెదిరింపులకు గురి చేశారు. అయితే, వారు మాంసాహారం తింటున్న వీడియోను ఓ వ్యక్తి సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అది కాస్త విపరీతంగా వైరల్ అవుతోంది. అనంతరం జరిగిన ఘటనపై భక్తులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. స్పందించిన టీటీడీ సదరు కాంట్రాక్ట్ సిబ్బందిని ఉద్యోగం నుంచి తొలగిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

Next Story