- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎన్టీఆర్‌కు ‘భారత రత్న’ ఇవ్వాలి.. మహానాడులో ఏకగ్రీవ తీర్మానం
ఎన్టీఆర్‌కు భారత రత్న ఇవ్వాలని మహానాడులో ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఇది తెలుగువారి ఆకాంక్ష అని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.

దిశ, వెబ్ డెస్క్: అమరావతి వేదికగా టీడీపీ మహానాడు 2026 కార్యక్రమం రెండో రోజు ప్రారంభం అయింది. హైబ్రిడ్ విధానంలో జరుగుతున్న ఈ సమావేశానికి లక్షలాది మంది టీడీపీ కార్యకర్తలు వర్చువల్ గా పాల్గొంటున్నారు. ఈ క్రమంలో మహానాడు రెండో రోజు.. మహానాడు ప్రతినిధుల సభలో ఎన్టీఆర్‌కు భారత రత్న ఇవ్వాలంటూ ప్రవేశపెట్టిన తీర్మానానికి పార్టీ శ్రేణులు, నాయకులు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. ఈ సందర్భంగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. ఎన్టీఆర్‌కు భారత రత్న పురస్కారాన్ని అందించాలనేది కేవలం ఒక పార్టీ డిమాండ్ కాదని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్ల మంది తెలుగువారి దశాబ్దాల ఆకాంక్ష అని స్పష్టం చేశారు. సినిమా రంగంలోనే కాకుండా, రాజకీయాల్లోనూ సంచలన మార్పులు తెచ్చి, పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పని చేసిన ఎన్టీఆర్.. ఈ అత్యున్నత గౌరవానికి అన్ని విధాలా అర్హులని ఆయన కొనియాడారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ పీఠం దాకా చాటిచెప్పిన ఎన్టీఆర్‌ను కేంద్ర ప్రభుత్వం భారత రత్నతో గౌరవించాల్సిన బాధ్యత ఉందని, ఈ దిశగా పార్టీ తరఫున గట్టి ప్రయత్నాలు కొనసాగిస్తామని చంద్రబాబు పేర్కొన్నారు.






