- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Breaking:కడపలో కూలిన మహానాడు టీడీపీ కటౌట్లు.. వీఆర్వోకు గాయాలు
by Jakkula.Mamatha |
వైఎస్‌ఆర్ కడప జిల్లాలో రేపు జరగనున్న టీడీపీ మహానాడుకు సర్వం సిద్ధమైంది.

X
దిశ,వెబ్‌డెస్క్: వైఎస్‌ఆర్ కడప జిల్లాలో రేపు జరగనున్న టీడీపీ మహానాడుకు సర్వం సిద్ధమైంది. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు శరవేగంగా పూర్తయ్యాయి. కడప నగరం మొత్తం పసుపు తోరణాలు, పార్టీ జెండాలు, ఫ్లెక్సీలతో నిండిపోయి, పండుగ వాతావరణాన్ని తలపిస్తోంది. మహానాడు సభ ప్రాంగణం మొత్తం భారీ కటౌట్లతో పసుపు మయమైంది.
ఈ క్రమంలో కడప(Kadapa District)లో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. దీంతో భారీ ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. కడపలో భారీగా ఈదురుగాలులకు టీడీపీ(TDP) మహానాడు ప్రాంగణంలో కటౌట్లు కిందపడిపోయాయి. ఈ క్రమంలో ప్రాంగణంలో ఉన్న అట్లూరు వీఆర్వోకు కటౌట్ పడి గాయాలు అయ్యాయి. వైఎస్‌ఆర్ కడప జిల్లాలో గత రెండు రోజుల నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ సాయంత్రం కడపకు సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ వెళ్లనున్నారు.
Next Story






