Mahaanadu: తెలుగు జాతి ఆరాధించే నేత ఎన్టీఆర్.. మహానాడులో సీఎం చంద్రబాబు

by Kema Shiva Kumar |   (  Updated:2025-05-28 06:07:12  IST  )

తెలుగు జాతి ఆరాధించే నేత ఎన్టీఆర్ అని సీఎం చంద్రబాబు (CM Chandrababu) అన్నారు.

Mahaanadu: తెలుగు జాతి ఆరాధించే నేత ఎన్టీఆర్.. మహానాడులో సీఎం చంద్రబాబు
X

దిశ, వెబ్‌‌డెస్క్: తెలుగు జాతి ఆరాధించే నేత ఎన్టీఆర్ అని సీఎం చంద్రబాబు (CM Chandrababu) అన్నారు. ఇవాళ మహానాడు (Mahaanadu)లో రెండు రోజు 102వ జయంతి సందర్భంగా పార్టీ వ్యవస్థాపకుడు, విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మహానాడులో తొలిరోజు పలు కీలక అంశాలపై చర్చించుకున్నామని అన్నారు. పార్టీ బలోపేతం, రాష్ట్ర ప్రజలకు మేలు చేసేలా చర్చలు జరిగాయని తెలిపారు.

తెలుగు జాతి మొత్తం ఆరాధించే ఏకైక నాయకుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. ఆయన జయంతి అంటేనే ఓ పండగ రోజని పేర్కొన్నారు. ఓకే వ్యక్తి రెండు రంగాల్లో.. అటు రాజకీయం, నటనలో రాణించడం చరిత్రలో చూడలేదన్నారు. తెలుగు సినిమా చరిత్రలోనే ఆయన ఓ ఎవరెస్ట్‌లా ఎదిగారని కితాబిచ్చారు. నీతి నిజాయితీ, పట్టుదలే ఎన్టీఆర్ (NTR) ప్రధాన ఆయుధాలని అన్నారు. ఆత్మగౌరవం, ఆత్మాభిమానం వీడని నాయకుడని తెలిపారు. 33 ఏళ్లు వెండి తెరకు.. 13 ఏళ్లు రాజకీయాల్లో అద్వితీయ చరిత్ర సృష్టించారని అన్నారు. ఎన్టీఆర్ అంటేనే పేదవాడికి భరోసా.. రైతులకు నేస్తమని పర్కొన్నారు. అన్ని వర్గాలు కీర్తించే ఏకైక నాయకుడు ఆయనేనని చంద్రబాబు అన్నారు.

Next Story