- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Mahaanadu: కోవర్టులారా ఖబర్దార్.. వారికి సీఎం చంద్రబాబు మాస్ వార్నింగ్
కరుడుగట్టిన నేరస్తులతో రాజకీయాలు చేస్తున్నామని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: కరుడుగట్టిన నేరస్తులతో రాజకీయాలు చేస్తున్నామని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. మహానాడు వేదిక నుంచి ఆయన రెండోరోజు కార్యకర్తలను ఉద్దేశించి ప్రసగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వివేకానంద రెడ్డి హత్య కేసులో నాలాంటి నాయకుడినే మోసం చేయగలిగారని అన్నారు. గుండెపోటుతో వివేకా చనిపోయారంటూ ప్రచారం చేశారని.. అందరిలా తాను కూడా నమ్మానని అన్నారు. అలాగే వారి ఆస్థాన పత్రిక కూడా అలానే వార్తను ఇచ్చిందని కామెంట్ చేశారు. ఎన్నికల బిజీలో ఉండి తాను కూడా ఆలోచించ లేదని.. మళ్లీ అసలు విషయం సాయంత్రానికి తెలిసిందన్నారు. వివేకాను గొడ్డలితో చంపారని.. రెండో రోజున వారి పత్రికలోనే నారాసుర రక్త చరిత్ర అంటూ రాసుకొచ్చారని ఫైర్ అయ్యారు. తనపై నెపం వేసేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. అలాంటి నేరస్తులతో రాజకీయం చేస్తున్నామని చంద్రబాబు అన్నారు.
‘సంతనూతపాడులో వీరయ్యచౌదరి, పల్నాడులో జంట హత్యలు జరిగితే తనకు అనుమానం వచ్చిందని అన్నారు. ఇప్పుడు నేను ఎవరినీ నమ్మడం లేదని.. ప్రతి ఒక్క విషయాన్ని వేరే విధంగా ఆలోచిస్తున్నానని తెలిపారు. కొంతమంది మన దగ్గర ఉండి వారికి కోవర్టులుగా పనిచేస్తూ వాళ్ల ప్రోత్సాహంతో ఇష్టానుసారంగా హత్యా రాజకీయాలు చేస్తున్నారు. మన వేలితో.. మన కంట్లోనే పొడుచుకునేలా చేస్తున్నారని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ వాళ్లు తమ వాళ్లను చంపుతున్నారంటూ చెడ్డపేరు తెస్తున్నారని అన్నారు. ఎవరైనా మన కార్యకర్తలు ఇలాంటి తప్పుడు పనిచేస్తే ఎవరిని ఉపేక్షించేది లేదని అన్నారు. నేరస్తులు ఖబడ్దార్.. నా వద్ద మీ ఆటలు సాగనివ్వనంటూ మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఇది నా హెచ్చరిక.. కోవర్టులను తమ వద్దకు పంపి.. వారి ద్వారా అజెండాను నెరవేర్చుకోవాలనుకుంటే ఆ విషయాలను కూడా ఇక నుంచి పసిగడతామని అన్నారు. కోవర్టుల పట్ల జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. వలస పక్షలు వస్తాయి పోతాయి.. కానీ నిజమైన కార్యకర్త శాశ్వతంగా ఉంటారని తెలిపారు. పార్టీ బలోపేతం కావాలి.. అదే సమయంలో కోవర్టుల పట్ల జాగ్రత్తగా ఉండాలని చంద్రబాబు నాయుడు సూచించారు.
కార్యకర్తే సుప్రీం.. ఇదే టీడీపీ సిద్ధాంతం
నా తెలుగు కుటుంబం.. ఆరు శాసనాలు.. ఇది భవిష్యత్తుకు గేమ్‌చేంజర్ అని చంద్రబాబు నాయుడుఅన్నారు. ఇది తెలుగువారి చరిత్ర తిరగరాయబోతున్నాయని తెలిపారు. పాత తరం విలువలు, కొత్త తరం ఆలోచనలు ఈ రెండు కలిపి ఆరుశాసనాలు రూపొందించామని తెలిపారు. ఈ శాసనాల ద్వారా తెలుగు ప్రజలను 2047 నాటికి ప్రపంచంలో నెంబర్‌వన్‌గా నిలపాలని తన ధృఢసంకల్పం అన్నారు. మళ్లీ జన్మ ఉంటే తెలుగు జాతి కోసం తెలుగు గడ్డపైనే పుడతా అన్నారు. కార్యకర్తలే అధినేత, కార్యకర్తలే సుప్రీం ఇది.. పార్టీ సిద్ధాంతం అన్నారు. 45 రోజుల్లో కోటికి పైగా సభ్యత నమోదు చేసిన ఏకైక పార్టీ తెలుగుదేశం అని తెలిపారు. తొలిసారి అసెంబ్లీకి 65 మంది యువతకు సీట్లు ఇచ్చిన చరిత్ర టీడీపీది అన్నారు. రాబోయే 40 ఏళ్లకు రోడ్‌మ్యాప్‌నకు రూపకల్పన చేసుకున్నామని తెలిపారు. ఇన్నేళ్లు తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడుతూ ఉందంటే దానికి కారణం పార్టీ కార్యకర్తలేనని పేర్కొన్నారు. భవిష్యత్తులో మీ సంక్షేమం సాధికారత కోసం పనిచేస్తానని అన్నారు. పార్టీ అందరికీ అండగా ఉంటుందన్నారు. ఎప్పుడు ఎన్నికలు పెట్టినా తెలుగుదేశం పార్టీ గెలవాలని.. ప్రజలు మెచ్చే రాజకీయ పాలన చేస్తామని చంద్రబాబు తెలిపారు.






