అట్టహాసంగా మహానాడు ప్రారంభం.. ఆ తొలి రిజిస్ట్రేషన్ సీఎం చంద్రబాబుదే

by Kema Shiva Kumar |   (  Updated:2025-05-27 06:30:13  IST  )

తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు పండుగగా భావించే ‘మహానాడు’ (Mahaanadu) నేటి నుంచి కడప (Kadapa) జిల్లాలో అట్టహాసంగా ప్రారంభమైంది.

అట్టహాసంగా మహానాడు ప్రారంభం.. ఆ తొలి రిజిస్ట్రేషన్ సీఎం చంద్రబాబుదే
X

దిశ, వెబ్‌డెస్క్: తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు పండుగగా భావించే ‘మహానాడు’ (Mahaanadu) నేటి నుంచి కడప (Kadapa) జిల్లాలో అట్టహాసంగా ప్రారంభమైంది. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఘన విజయం తర్వాత జరుగుతున్న తొలి మహానాడును మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేశారు. ఈ నేపథ్యంలో కడప మొత్తం పసుపు జెండాలు, పచ్చని తోరణాలతో పసుపుమయమైంది. మహానాడులో పాల్గొనేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలి వచ్చారు. కాసేపటి క్రితమే సీఎం చంద్రబాబు (CM Chandrababu) సభా ప్రాంగణానికి వచ్చి పార్టీ సభ్యత నమోదులో భాగంగా తొలి రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌‌ను తిలకించారు. ఈ సందర్భంగా మహానాడుకు హాజరైన వారిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. టీడీపీ (TDP) మౌలిక సిద్ధాంతాలు, ఆరు సూత్రాల ఆవిష్కరణ, నియమావళి సవరణలపై చర్చించనున్నారు. అదేవిధంగా పార్టీ జాతీయ అధ్యక్షుడి ఎన్నికకు నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నారు.

రొటిన్‌కు భిన్నంగా పసుపు చొక్కాలో సీఎం..

నిత్యం ఒకే డ్రెస్‌లో కనిపించే సీఎం చంద్రబాబు రొటీన్‌కు భిన్నంగా పసుపు చొక్కా ధరించి మ‌హానాడు ప్రాంగ‌ణంలోకి ఎంట్రీ ఇచ్చారు. అనంతరం అక్కడే స‌భ్యత్వ న‌మోదు వ‌ద్ద టీడీపీ (TDP) ప్రతినిధులతో కాసేపు మాట్లాడారు. ఈ సందర్భంగా పార్టీ ప్రతినిధులు చంద్రబాబుకు మ‌హానాడు ఆహ్వాన ప‌త్రికను అందజేశారు. అనంతరం టీడీపీ వ్యవస్థాపకుడు నంద‌మూరి తార‌క రామారావు (Nandamuri Taraka Ramarao)తో పాటు శ్రీప‌తి రాజేశ్వర రావు (Sripati Rajeswara Rao) చిత్ర పటాలకు పూలమాలలు వేసి సీఎం చంద్రబాబు నివాళులర్పించారు.

Next Story