- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పుట్టిన రోజు నాడే ఎంపీ మాగుంట కీలక ప్రకటన
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి షాకింగ్ ప్రకటన చేశారు. వచ్చే ఎన్నిక

దిశ, వెబ్ డెస్క్ : తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి షాకింగ్ ప్రకటన చేశారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడంపై తాజాగా ఆయన స్పందించారు. తన పుట్టినరోజు సందర్భంగా కుమారుడి రాజకీయ రంగ ప్రవేశానికి రూట్ క్లియర్ చేశారు మాగుంట శ్రీనివాసులు రెడ్డి. రాబోయే ఎన్నికల సమయానికి తన కుమారుడు రాఘవరెడ్డి ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉంటాడని ఆయన వెల్లడించారు. 2024 సమయంలోనే తన కుమారుడు పోటీ చేయాల్సి ఉండగా, సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల వరకు తాను పోటీ చేసినట్లు వెల్లడించారు.
లేకపోతే అప్పుడే తన కుమారుడు పోటీ చేసేవాడని వివరించారు. ఇలాంటి నేపథ్యంలో వచ్చే ఎన్నికల సమయానికి తమ కుటుంబాన్ని ప్రజలు ఆదరించాలని కోరారు మాగుంట. తన కొడుకుకు టికెట్ ఫైనల్ అయితే తాను పోటీ చేయబోనని వివరణ ఇచ్చారు. ఇది ఇలా ఉండగా, 1998 సమయంలోనే కాంగ్రెస్ పార్టీ తరఫున ఒంగోలు నుంచి పోటీ చేసి ఎంపీ అయ్యారు మాగుంట శ్రీనివాసులు రెడ్డి. 2019 ఎన్నికల సమయంలో వైసీపీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఇక మొన్న 2024 సమయంలో టిడిపి పార్టీ నుంచి పోటీ చేసి ఘన విజయం సాధించారు. క్లిక్






