- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మధుసూదన్ కుటుంబానికి రూ.50 లక్షల ఆర్థికసాయం అందజేత
జమ్మూకశ్మీర్‌లోని పెహల్గాంలో ఉగ్రదాడి(Terror Attack) జరిగి పదుల సంఖ్యలో పౌరులు మృతిచెందిన విషయం తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: జమ్మూకశ్మీర్‌లోని పెహల్గాంలో ఉగ్రదాడి(Terror Attack) జరిగి పదుల సంఖ్యలో పౌరులు మృతిచెందిన విషయం తెలిసిందే. మృతుల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సోమిశెట్టి మధుసూదన్(Madhusudhan Rao) కుటుంబం ఉన్న విషయం తెలిసిందే. ఈ కుటుంబానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan) రూ.50 లక్షల పరిహారం ప్రకటించారు. తాజాగా ఆ పరిహారాన్ని TIDCO చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్‌తో కలిసి మంత్రి కందుల దుర్గేశ్(Kandula Durgesh) అందజేశారు. మధుసూదన్ తల్లి పేరుపై రూ.5 లక్షలు, అలాగే వారి కూతురు, కొడుకు పేర్లపై చెరో రూ. 22.5 లక్షల చెక్కులను అందజేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా కందుల దుర్గేశ్ మాట్లాడారు. వీరుల త్యాగం ఎప్పటికీ మర్చిపోలేనిదన్నారు. దేశ రక్షణ కోసం ప్రాణాలు అర్పించిన మధుసూధన్‌కి శతకోటి వందనాలు తెలిపారు. మధుసూదన్ కుటుంబానికి ఎల్లప్పుడూ ప్రభుత్వం తరపున అండగా ఉంటాం అని భరోసా ఇచ్చారు.






