- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మదనపల్లె : ఫైల్స్ దగ్ధం కేసులో సీఐడీ సోదాలు
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయం ఫైల్స్ దగ్ధం కేసులో ఏపీ సీఐడీ దర్యాప్తును ముమ్మరం చేసింది.

దిశ, వెబ్ డెస్క్ : మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయం ఫైల్స్ దగ్ధం కేసులో ఏపీ సీఐడీ దర్యాప్తును ముమ్మరం చేసింది. అందులో భాగంగా దస్త్రాల దహనం కేసులో నిందితుడిగా ఉన్న మాధవరెడ్డి ఇంట్లో సీఐడీ అధికారులు సోదాలను చేపట్టారు. తెల్లవారుజామునే మాధవ రెడ్డి ఇంటికి అధికారులు చేరుకున్నారు. నిందితుడి ఇంటిని ఆధీనంలోకి తీసుకొని సోదాలను చేపట్టారు. మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్ల దగ్ధం కేసులో మాజీ మంత్రి పెద్దిరెడ్డి ప్రధాన నిందితుడిగా ఉన్నారు. ఈ క్రమంలో ఆయన అనుచరుడైన మాధవరెడ్డి ఇంట్లో సీఐడీ అధికారులు శనివారం సోదాలను చేపట్టారు. మాధవ రెడ్డి నివాసం వద్ద పటిష్ట బందోబస్తును పోలీసులు ఏర్పాటు చేశారు. ఇంటి నుంచి పలు దస్త్రాలను సీఐడీ అధికారులు సేకరించినట్లు తెలుస్తోంది. కేసుకు సంబంధించిన కీలక ఆధారాలను అధికారులు సేకరించే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం.
కేసు పరిణామాలు
అయితే ఇదే కేసులో నిందితుడిగా ఉన్న మాజీ ఆర్డీఓ మురళిని సీఐడీ అధికారులు సెప్టెంబరు నెలలో అరెస్టు చేశారు. కేసు వివరాల్లోకి వెళ్తే 2024 జులై 21న మదనపల్లె సబ్‌కలెక్టర్ కార్యాలయంలో మంటలు చెలరేగి ఫైల్స్ దగ్ధం అయ్యాయి. ఈ కేసులో మురళి నిందితుడిగా ఉన్నాడు. గతంలో పోలీసులు ఈ కేసును తీవ్రంగా దర్యాప్తు చేస్తున్నా, పూర్తి స్థాయిలో సాక్ష్యాలు లభ్యం కాలేదు. మరిన్ని వివరాలను సేకరించడం కోసం మాజీ ఆర్డీఓ మురళిని కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించారు. ఈ కేసులో ఆర్థిక మోసాలకు సంబంధించి కూడా అనుమానాలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా ప్రభుత్వ రికార్డులు దగ్ధం కావడంతో, ఆ డాక్యుమెంట్లలో ఉన్న కీలక సమాచారం దొరకకపోవడంతో వివిధ శాఖలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. ఇదే కేసులో అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్ ఫైళ్ల దగ్ధంకేసులో జూనియర్ అసిస్టెంట్ గౌతమ్ తేజ్‌ను సీఐడీ అధికారులు డిసెంబర్ 2024లో పలమనేరులో అరెస్టు చేశారు.






