- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భగవద్గీతపై వ్యాఖ్యల దుమారం.. ఎమ్మెస్ రాజుపై భాను ప్రకాశ్ ఆగ్రహం
by Vemula.Srinu Prasad |
భగవద్గీత వల్ల ఎవరి తల రాతలు మారలేదని మడకశిర టీడీపీ ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు అన్నారు..

X
దిశ, వెబ్ డెస్క్: భగవద్గీత(Bhagavad Gita) వల్ల ఎవరి తల రాతలు మారలేదని మడకశిర టీడీపీ ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు(Madakasira TDP MLA M.S. Raju) అన్నారు. బైబిల్, భగవద్గీత వల్ల ఎవరి జీవితాలు మారలేదని, బాగుపడలేదని ఆయన తెలిపారు. కేవలం అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లే ప్రజల తలరాతలు మారాయని ఎమ్మెస్ రాజు అన్నారు.
ఎమ్మెస్ రాజు వ్యాఖ్యలు
అయితే ఎమ్మెస్ రాజు చేసిన ఈ వ్యాఖ్యలపై టీటీడీ పాలక మండలి సభ్యుడు భాను ప్రకాశ్ రెడ్డి(TTD Governing Council Member Bhanu Prakash Reddy) స్పందించారు. 5 వేల ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న భగవద్గీతను ఎమ్మెస్ రాజు అవహేళన చేశారని ఆయన మండిపడ్డారు. ప్రధాని మోడీ(Pm Modi) విదేశాలకు వెళ్లినప్పుడు ఆయా ప్రతినిధులకు భగవద్గీతను బహూకరిస్తున్నారని తెలిపారు. హిందువులకు ఎమ్మెస్ రాజు వెంటనే క్షమాపణ చెప్పాలని భాను ప్రకాశ్ రెడ్డి డిమాండ్ చేశారు.
Next Story






