మా స్థలం కబ్జా చేశారు: పాటల రచయిత అనంత శ్రీరామ్ ఫిర్యాదు

by Vemula.Srinu Prasad |

సినీ గేయ రచయిత అనంత్ శ్రీరామ్ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక లో ఫిర్యాదు చేశారు..

మా స్థలం కబ్జా చేశారు: పాటల రచయిత అనంత శ్రీరామ్ ఫిర్యాదు
X

దిశ, వెబ్ డెస్క్: సినీ గేయ రచయిత అనంత్ శ్రీరామ్(Film Lyricist Ananth Sriram) పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం కలెక్టరేట్(Bhimavaram Collectorate) కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS)లో ఫిర్యాదు చేశారు. యలమంచిలి మండలం దొడ్డిపట్ల(Doddipatla)లో తమకు చెందిన ఐదు సెంట్ల ఉమ్మడి స్థలాన్ని కొందరు ఆక్రమించారని ఆయన అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.

ఈ స్థల వివాదం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉందని అనంత్ శ్రీరామ్ పేర్కొన్నారు. అయినప్పటికీ, మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్య కుమారుడు చేగొండి సూర్యప్రకాష్ తన తల్లిదండ్రులను భయభ్రాంతులకు గురిచేస్తూ, బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆయన తన ఫిర్యాదులో ఆరోపించారు. గ్రామంలో ఉంటున్న తన వృద్ధులైన తల్లిదండ్రులకు ప్రాణహాని ఉందనే ఆందోళన వ్యక్తం చేస్తూ, వారికి తగిన రక్షణ కల్పించాలని అనంత్ శ్రీరామ్ జిల్లా అధికారులను కోరారు. ఈ భూ వివాదంపై విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Next Story