- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
12 గంటల్లో అల్పపీడనం.. ఏపీకి భారీ వర్షసూచన
ఐఎండీ తెలిపిన వివరాల ప్రకారం ఉత్తర ఒడిశా నుంచి పశ్చిమ బెంగాల్ తీరం మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందన్నారు.

దిశ, వెబ్‌డెస్క్: వాయువ్య బంగాళాఖాతంలో రానున్న 24 గంటల్లో అల్పపీడం ఏర్పడే అవకాశం ఉన్నట్లు ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు. ఐఎండీ తెలిపిన వివరాల ప్రకారం ఉత్తర ఒడిశా నుంచి పశ్చిమ బెంగాల్ తీరం మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందన్నారు. దీని ప్రభావంతో రానున్న నాలుగు రోజుల్లో రాష్ట్రంలో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని, గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. ఈ క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, భారీవర్షాల నేపథ్యంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. భారీ హోర్డింగులు, చెట్ల కింద, శిథిలావస్థలో ఉన్న గోడలు, భవనాలు వంటి వాటి వద్ద నిలబడవద్దని తెలిపారు.
నేడు శ్రీకాకుళం,విజయనగరం,పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. విశాఖపట్నం, అనకాపల్లి, కోనసీమ, పశ్చిమగోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
శుక్రవారం (జూన్ 27) శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో అక్కడక్కడా పిడుగలతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. అలాగే కోనసీమ, తూ.గో, ప.గో, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్సార్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్నిప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపారు.
బుధవారం సాయంత్రం వరకు.. తూ.గో. జిల్లా నాగంపల్లెలో 49 మి.మీ వర్షపాతం నమోదవ్వగా.. విశాఖ రూరల్ 37.7 మి.మీ, ఎన్టీఆర్ జిల్లా మునకుళ్ళలో 36.5 మి.మీ, అల్లూరి జిల్లా కూనవరంలో 35.7 మి.మీ, విశాఖ జిల్లా ఎండాడలో 35.7 మి.మీ, సీతమ్మధారలో 35.5 మి.మీ చొప్పున వర్షపాతం నమోదైనట్లు వెల్లడించారు.






