- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Minister Savita : ప్రేమోన్మాదికి కఠిన శిక్ష పడాలి : మంత్రి సవిత
కడప జిల్లా వేములవాడ యువతిపై ప్రేమోన్మాది(Love addicts) కత్తితో దాడి చేసిన ఘటనపై ఇంచార్జి మంత్రి సవిత(Minister Savita) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు

X
దిశ, వెబ్ డెస్క్ : కడప జిల్లా వేములవాడ యువతిపై ప్రేమోన్మాది(Love addicts) కత్తితో దాడి చేసిన ఘటనపై ఇంచార్జి మంత్రి సవిత(Minister Savita) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా ఎస్పీ విద్యాసాగర్ తో ఫోన్ లో మాట్లాడిన మంత్రి సవిత సంఘటన వివరాలు తెలుసుకున్నారు. తక్షణమే నిందితుడిని అదుపులోకి తీసుకుని, అతనికి కఠిన శిక్ష పడేలా అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బాధిత యువతికి మెరుగైన వైద్యమందించాలని తిరుపతి రుయా వైద్యులను ఆదేశించారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి సవిత స్పష్టం చేశారు.
తనను ప్రేమించడం లేదన్న కోపంతో షర్మిల అనే యువతిపై కుళ్లాయప్ప అనే యువకుడు కత్తితో దాడి చేశాడు. బాధితురాలి శరీరంపై 11 కత్తిపోట్లు ఉన్నాయని వైద్యులు గుర్తించారు. చికిత్స పొందుతున్న యువతి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది.
Next Story






