ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు యువకులు మృతి

by Naga Rani Yarlagadda |

రోడ్డుప్రమాదంలో ముగ్గురు యువకులు మృతి చెందిన ఘటన బాపట్ల జిల్లాలో చోటుచేసుకుంది.

ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు యువకులు మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: రోడ్డుప్రమాదంలో ముగ్గురు యువకులు మృతి చెందిన ఘటన బాపట్ల జిల్లాలో చోటుచేసుకుంది. శనివారం సాయంత్రం కొండుబొట్లవారిపాలెం అడ్డరోడ్డుపై వెళ్తున్న బైక్ ను లారీ ఢీ కొట్టడంతో ముగ్గురు యువకులు స్పాట్ లో మరణించారు. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు.. లారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. ముగ్గురి మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించి, కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story