ఆటోను ఢీ కొట్టిన లారీ.. నలుగురి దుర్మరణం

by Naga Rani Yarlagadda |

పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. శావల్యాపురం మండలం కలమర్లపూడి వద్ద ఆటోని లారీ ఢీ కొట్టడంతో.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం చెందారు.

ఆటోను ఢీ కొట్టిన లారీ.. నలుగురి దుర్మరణం
X

దిశ, వెబ్‌డెస్క్: పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. శావల్యాపురం మండలం కలమర్లపూడి వద్ద ఆటోని లారీ ఢీ కొట్టడంతో.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం చెందారు. ఈ ప్రమాదంలో మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నట్లు గుర్తించారు. మృతులు, క్షతగాత్రులంతా కారుమంచి గ్రామంలోని బీసీ కాలనీకి చెందినవారుగా గుర్తించారు. కారుమంచి నుంచి వినుకొండకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటనా ప్రాంతంలో సహాయక చర్యలు చేపట్టిన పోలీసులు క్షతగాత్రుల్ని ఆస్పత్రికి తరలించారు.

Next Story