Look Out Notice: కొడాలి నానికి ఊహించని షాక్.. లుకౌట్‌ నోటీసులు జారీ

by Kema Shiva Kumar |   (  Updated:2025-05-23 03:09:27  IST  )

వైసీపీ ముఖ్య నేత, మాజీ మంత్రి కొడాలి నాని (Kodali Nani)పై కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధర్‌ (Gangadhar) లుకౌట్‌ నోటీసులు జారీ చేశారు.

Look Out Notice: కొడాలి నానికి ఊహించని షాక్.. లుకౌట్‌ నోటీసులు జారీ
X

దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ ముఖ్య నేత, మాజీ మంత్రి కొడాలి నాని (Kodali Nani)పై కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధర్‌ (Gangadhar) లుకౌట్‌ నోటీసులు జారీ చేశారు. అయితే, కొడాలి నాని అనారోగ్య సమస్యలను సాకుగా చూపి అమెరికా వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని, వెంటనే పాస్‌పోర్టు సీజ్ చేసి ఆయన కదిలికలపై ఎప్పటికప్పుడు నిఘా పెట్టాలని టీడీపీ కార్యానిర్వాహక కార్యదర్శి కనపర్తి శ్రీనివాస్ రావు Srinivasa Rao) ఇటీవలే డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా (Harish Kumar Gupta)కు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ ఉదయం కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధర్ కొడాలి నానిపై లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆయనపై పెద్ద ఎత్తున కేసులు నమోదైన క్రమంలో దేశం విడిచి వెళ్లకుండా ఎయిర్‌పోర్టులు, ప్రధాన పోర్టులకు పోలీసులు లుక్అవుట్ నోటీసులపై సర్క్యులర్ జారీ చేశారు. కాగా, ఇటీవలే ముంబై (Mumbai)లో కొడాలి నానికి హార్ట్‌కు శస్త్ర చికిత్స జరిగిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన వైద్యుల సూచన మేరకు విశ్రాంతి తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది.

Next Story