ఇంట్లో ప్రత్యక్షమైన భారీ కొండ చిలువ.. యజమాని ఏం చేశాడంటే..!

by Vemula.Srinu Prasad |

పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం కేసానుపల్లిలో కొండ చిలువ కలకలం రేగింది. ..

ఇంట్లో ప్రత్యక్షమైన భారీ కొండ చిలువ.. యజమాని ఏం చేశాడంటే..!
X

దిశ, వెబ్ డెస్క్: పల్నాడు జిల్లా(Palnadu district) దాచేపల్లి మండలం (Dachepalli mandal) కేసానుపల్లిలో కొండ చిలువ(Python) ప్రత్యక్షం కలకలం రేగింది.10 అడుగుల పొడవైన కొండచిలువ ఏకంగా ఇంట్లోకి కనిపించింది. ఈ ఘటన కేసానుపల్లి శివాలయం(Shiva Temple) బజారులోని షేక్ బాజీ ఇంట్లో జరిగింది. దీంతో గ్రామస్తులు కొండచిలువను చూసి భయాందళనకు గురయ్యారు. వెంటనే తలపై కొట్టి చంపేశారు. అనంతరం ఫారెస్ట్ అధికారులు సమాచారం ఇచ్చారు. స్థానిక అటవీ ప్రాంతం నుంచి కొండ చిలువ వచ్చిందని, తరచూ పాములు, చిన్న చిన్న విషపూరిత పరుగులు, కీటకాలు వస్తున్నాయని అటవీ అధికారులు దృష్టి సారించాలని కోరారు. తమ గ్రామంలో ఎలాంటి విష పురుగులు రాకుండా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.

Next Story