Lokesh: ఎస్సీ వర్గీకరణపై లోకేశ్ క్లారిటీ.. ఈ నెలలోనే డీఎస్సీ నోటిఫికేషన్

by Thanuru Gopichand |   (  Updated:2025-03-04 13:34:30  IST  )

ట్టిపరిస్థితుల్లోనూ ఈ నెలలో డీఎస్సీ నోటిఫికేషన్ఇ స్తామని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ ​స్పష్టం చేశారు.

Lokesh: ఎస్సీ వర్గీకరణపై లోకేశ్ క్లారిటీ.. ఈ నెలలోనే డీఎస్సీ నోటిఫికేషన్
X

దిశ, డైనమిక్ ​బ్యూరో: ఎట్టిపరిస్థితుల్లోనూ ఈ నెలలో డీఎస్సీ నోటిఫికేషన్ (dsc notificaton) ఇస్తామని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ (nara lokesh) ​స్పష్టం చేశారు. డీఎస్సీ నోటిఫికేషన్ పై మండలిలో వైసీపీ సభ్యుల ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి లోకేశ్​మాట్లాడుతూ నిరుద్యోగ యువత ఆశతో ఎదురుచూస్తున్నారని, వారికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. గత వైసీపీ ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో ఒక్క డీఎస్సీ కూడా నిర్వహించలేదని, ఒక్క టీచర్ పోస్టు భర్తీ చేయలేదని ఆరోపించారు. దీనిపై వైసీపీ సమాధానం చెప్పాలన్నారు. ఒక్క టీడీపీ హయాంలోనే 70 శాతం టీచర్ పోస్టులు భర్తీ చేశామన్నారు.

మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే డీఎస్సీ ఫైల్ పై మొదటి సంతకం చేసినట్లు తెలిపారు. అందులో భాగంగానే టెట్ (tet)నిర్వహించామన్నారు. వర్గీకరణపై వన్ మ్యాన్ కమిషన్ (one man commission) నివేదిక త్వరలోనే రాబోతోందని పేర్కొన్నారు. ఆ వెంటనే ఈ నెలలో నోటిఫికేషన్​ఇస్తామని, ఈ మేరకు నిరుద్యోగ యువతీ, యువకులకు ఈ సభ సాక్షిగా హామీ ఇస్తున్నానని ప్రకటించారు. ప్రతిపక్ష పార్టీ నేతలు ప్రశ్నలు వేసి, చర్చించేందుకు సిద్ధంగా లేరని, ఇది చాలా బాధాకరమన్నారు. ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకోవాలని సూచించారు. కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పథకాన్ని అమలు చేయనుందని, ఇందుకు సంబంధించిన గైడ్ లైన్స్ ను త్వరలోనే ప్రకటిస్తామని మంత్రి లోకేశ్​వెల్లడించారు. ఈ పథకంపై మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు. తల్లికి వందనం (talliki vandanam) పథకానికి బడ్జెట్ లో రూ.9,407 కోట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు.

Next Story