ఏపీనీ గ్లోబల్ అగ్రి-ఫుడ్ హబ్‌గా మార్చే దిశగా లోకేష్ అడుగులు

by Thanuru Gopichand |   (  Updated:2026-01-20 09:27:56  IST  )

రాష్ట్రాన్ని బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్న ఐటీ, విద్యా శాఖల మంత్రి.

ఏపీనీ గ్లోబల్ అగ్రి-ఫుడ్ హబ్‌గా మార్చే దిశగా లోకేష్ అడుగులు
X

దిశ, వెబ్ డెస్క్ : ఏపీ రాష్ట్రాన్ని దేశంలోనే ప్రధాన అగ్రి-ఫుడ్ హబ్‌గా తీర్చిదిద్దే లక్ష్యంతో ఐటీ, విద్యా శాఖల మంత్రి నారా లోకేశ్(Nara Lokesh) కృషి చేస్తున్నారు. తన విదేశీ పర్యటనలో భాగంగా కీలక సమావేశాలు నిర్వహిస్తున్నారు. స్విట్జర్లాండ్‌లోని జ్యూరిక్ లో బల్హర్ గ్రూప్ (Bulher Group) ఎగ్జిక్యూటివ్ బోర్డ్ అడ్వైజర్ అండ్ బల్హర్ ఇండియా చైర్మన్ దీపక్ మానేతో (Deepak Mane) లోకేశ్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో వ్యవసాయం, ఆహార శుద్ధి రంగాల్లో ఉన్న అపారమైన అవకాశాలను మంత్రి లోకేశ్ వివరించారు. ముఖ్యంగా అగ్రి-ఎక్స్‌పోర్ట్ క్లస్టర్ల బలోపేతం, తృణధాన్యాల (మిల్లెట్స్) ప్రాసెసింగ్, ఫుడ్-టెక్ స్కిల్లింగ్ వంటి రంగాల్లో ఆంధ్రప్రదేశ్‌తో భాగస్వాములు కావాలని బల్హర్ సంస్థను ఆహ్వానించారు.

​రాష్ట్రంలో 'మేక్ ఇన్ ఇండియా' కింద తయారీ రంగాన్ని ప్రోత్సహించడంతో పాటు, అత్యాధునిక సాంకేతికతతో కూడిన ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుపై చర్చలు జరిపారు. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పరిశ్రమల అనుకూల విధానాలు, మౌలిక సదుపాయాల కల్పన ద్వారా అంతర్జాతీయ సంస్థలకు ఏపీ సరైన వేదిక అవుతుందని లోకేష్ ధీమా వ్యక్తం చేశారు. బల్హర్ గ్రూప్ వంటి ప్రపంచ స్థాయి సంస్థల సహకారంతో రాష్ట్రంలోని రైతులకు మేలు జరగడమే కాకుండా, నిరుద్యోగ యువతకు ఫుడ్ టెక్నాలజీ విభాగంలో మెరుగైన ఉపాధి అవకాశాలు లభిస్తాయని మంత్రి లోకేశ్ పేర్కొన్నారు. ఈ చర్చల ఫలితంగా ఏపీకి భారీ పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Next Story