- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆశ్రమ పాఠశాలలో అశ్లీల నృత్యాలు.. మంత్రి నారా లోకేశ్ సీరియస్
మన్యం జిల్లా నీలకంఠపురం గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఇటీవల రికార్డింగ్ డ్యాన్స్ లు చేసిన ఘటన వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. డిప్యూటీ వార్డెన్ ఆధ్వర్యంలో రికార్డింగ్ డ్యాన్స్ లు ఏర్పాటు చేయించినట్టు ఆరోపణలు వచ్చాయి.

దిశ, వెబ్ డెస్క్: మన్యం జిల్లా నీలకంఠపురం గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఇటీవల రికార్డింగ్ డ్యాన్స్ లు చేసిన ఘటన వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. డిప్యూటీ వార్డెన్ ఆధ్వర్యంలో రికార్డింగ్ డ్యాన్స్ లు ఏర్పాటు చేయించినట్టు ఆరోపణలు వచ్చాయి. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవ్వడంతో తీవ్ర విమర్శలు వచ్చాయి. చిన్నారుల ముందు ఇలాంటి పిచ్చిపనులు ఏంటి అంటూ నెటిజన్లు మండిపడ్డారు. తాజాగా ఈ ఘటనపై మంత్రి లోకేష్ సీరియస్ అయ్యారు. ఘటనకు కారణమైనవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు.
ఇక ఇప్పటికే పాఠశాల డిప్యూటీ వార్డెన్ చంద్రమోహన్ ను ఐటీడీఏ అధికారులు సస్పెండ్ చేయగా మంత్రి సీరియస్ అవ్వడంతో టీచర్లపైనా చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే ఇటీవల ఏపీలో సంక్రాంతి సంబరాల్లో చాలాచోట్ల రికార్డింగ్ డ్యాన్స్ లు నిర్వహించారు. ఆ వీడియోలు వైరల్ అవ్వడంతో ప్రభుత్వంపై, అధికారులపై విమర్శలు వచ్చాయి. ఇక ఇప్పుడు ఏకంగా చిన్నపిల్లలు చదువుకునే స్కూళ్లో సైతం రికార్డింగ్ డ్యాన్సులు నిర్వహించడంతో ప్రతిపక్షాల విమర్శలు తారాస్థాయికి చేరాయి.






