Lokesh: డీఎస్సీపై లోకేశ్ ​మరోసారి క్లారిటీ.. ఏమన్నారంటే

by Thanuru Gopichand |   (  Updated:2025-02-25 11:40:38  IST  )

శాసనమండలి సాక్షిగా చెప్తున్నా.. ఏప్రిల్ లేదా మే నెలలో తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలు అమలు చేస్తాం.

Lokesh: డీఎస్సీపై లోకేశ్ ​మరోసారి క్లారిటీ.. ఏమన్నారంటే
X

దిశ, డైనమిక్ బ్యూరో : డీఎస్సీ నిర్వహణపై మంత్రి నారా లోకేశ్​ మరోసారి క్లారిటీ ఇచ్చారు. ఎన్నికల కోడ్ పూర్తయిన వెంటనే డిఎస్సీ నోటిఫికేషన్ ఇస్తాం, అది కూడా పారదర్శకంగా నిర్వహిస్తామని వెల్లడించారు. శాసనమండలిలో ఈ రోజు ఆయన మాట్లాడుతూ డీఎస్సీ నిర్వహణకు ఇప్పటికే టెట్​జరిపామన్నారు. కొన్ని సాంకేతిక కారణాలతో డీఎస్సీ పోస్ట్ పోన్ అయిందన్నారు. ఎన్నికల కోడ్ పూర్తయిన వెంటనే 16387 పోస్టులను భర్తీ చేస్తామన్నారు. ఈ అకడమిక్ ఇయర్ కే కొత్త ఉపాధ్యాయులను నియమిస్తామన్నారు. శాసనమండలి సాక్షిగా చెప్తున్నా.. ఏప్రిల్ లేదా మే నెలలో తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలు అమలు చేస్తాం. ఇచ్చిన ప్రతి హామీకి కట్టుబడి ఉన్నామని ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్​స్పష్టం చేశారు. తన యువగళం పాదయాత్రలో ప్రజల సమస్యలను తెలుసుకున్నానన్నారు. పేదరికం లేని ఆంధ్ర రాష్ట్రమే ఎన్డీఏ లక్ష్యమని తెలిపారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని లక్ష్యంతో ప్రభుత్వం పని చేస్తుందన్నారు. ఇచ్చిన ప్రతి హామీకి కట్టుబడి ఉన్నామని తెలిపారు.

Next Story