- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కూలిన బ్రహ్మంగారి నివాస గృహం.. అధికారులకు లోకేశ్ కీలక ఆదేశాలు
మెంథా తుఫాన్ ప్రభావంతో ఏపీలో అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి. తుఫాన్ కారణంగా గాలులు బలంగా వీస్తున్నాయి. దీంతో చాలా ప్రాంతాల్లో చెట్లు నేలకు ఒరగటం, ఇల్లు కూలిపోవడం లాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి.

దిశ, వెబ్ డెస్క్: మెంథా తుఫాన్ ప్రభావంతో ఏపీలో అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి. తుఫాన్ కారణంగా గాలులు బలంగా వీస్తున్నాయి. దీంతో చాలా ప్రాంతాల్లో చెట్లు నేలకు ఒరగటం, ఇల్లు కూలిపోవడం లాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే వర్షాల కారణంగా కడప జిల్లాలోని పోతులూరి వీరబ్రహ్మంద్రస్వామి నివాసగృహం సైతం కూలిపోయింది.
దీంతో చారిత్రక ప్రదేశాన్ని కాపడటంతో పునర్న్మించడంలో అధికారులు విఫలం అయ్యారని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీరబ్రహ్మేంద్రస్వామి ఇల్లు కూలిపోవడంతో తమ మనోభావాలు దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా తాజాగా ఈ ఘటనపై మంత్రి నారాలోకేష్ స్పందించారు. బ్రహ్మంగారి నివాస గృహాన్ని మళ్లీ నిర్మించాలని, మన సాంస్కృతిక వారసత్వంలోని విలువైన సంపదను కాపాడటానికి తక్షణ చర్యలు తీసుకోవాలని కడప కలెక్టర్ కు ఆదేశాలు జారీ చేశారు.






