వైసీపీకి కొత్త పేరు పెట్టిన లోకేష్.. ఏంటంటే?

by Ajay Maddhiboyina |

మంత్రి నారాలోకేష్ మరోసారి వైసీపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కడపలో టీడీపీ కార్యకర్తల సమన్వయ సమావేశంలో పాల్గొన్న ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీకి కొత్తగా తాను గొడ్డలి పార్టీ అని పేరు పెట్టినట్టు చెప్పారు.

వైసీపీకి కొత్త పేరు పెట్టిన లోకేష్.. ఏంటంటే?
X

దిశ, వెబ్ డెస్క్: మంత్రి నారాలోకేష్ మరోసారి వైసీపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కడపలో టీడీపీ కార్యకర్తల సమన్వయ సమావేశంలో పాల్గొన్న ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీకి కొత్తగా తాను గొడ్డలి పార్టీ అని పేరు పెట్టినట్టు చెప్పారు. దానికి జగన్ ఫీల్ అయ్యారని, కానీ రప్పారప్పా అన్నది మీరే కదా అని ప్రశ్నించారు. జగన్ సినిమా చూపిస్తే ఎండ్ కార్డ్ వేసే బాధ్యత పసుపు సైనికులది అని వ్యాఖ్యానించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారి పెద్ద దస్తగిరిని జగన్ మేనమామ చంపేసి, తమపై కేసులు పెడతామని బెదిరించారన్నారు. జగన్ కు ఛీటింగ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు ఇవ్వొచ్చన్నారు. బయట ముద్దులు పెట్టి లోపల గొడ్డలి పోట్లు వేస్తారని, జగన్ అద్భుత నటనకు భాస్కర్ అవార్డు గ్యారంటీ అంటూ ఎద్దేవా చేశారు.

కూటమి మధ్య చిచ్చు పెట్టేందుకు వైసీపీ సైకోలు కుట్ర చేస్తున్నారంటూ మండిపడ్డారు. రాయలసీమకు పట్టిన క్యాన్సర్ గడ్డ జగన్మోహన్ రెడ్డి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తల్లి, చెల్లిని తరిమేశారని, బాబాయిని లేపేసి మరో చెల్లి కుటుంబానికి అన్యాయం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. సొంత జిల్లాను, నియోజకవర్గాన్ని మోసం చేశారని, 2019లో సొంత బాబాయిని లేపేశారన్నారు. గుండెపోటు అన్నారు, తర్వాత గొడ్డలివేటు బయటకు వచ్చిందని వ్యాఖ్యానించారు. తర్వాత దొంగపేపర్ లో నారాసుర రక్తచరిత్ర అని రాసి చంద్రబాబు చేతిలో కత్తి పెట్టి ఫొటో వేశారని అన్నారు. జగన్ ఎంత మోసగాడో ప్రజలకు అర్థమైందని వ్యాఖ్యానించారు.

Next Story