- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రధానితో ముగిసిన లోకేష్ దంపతుల భేటీ
ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Modi)తో ఏపీ మంత్రి నారా లోకేష్ (Minister Nara Lokesh) దంపతుల భేటీ ముగిసింది. ఇటీవల అమరావతికి వచ్చిన ప్రధాని.. తనను ప్రత్యేకంగా కలవాలని సూచించిన విషయం తెలిసిందే.

X
దిశ, వెబ్‌డెస్క్: ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Modi)తో ఏపీ మంత్రి నారా లోకేష్ (Minister Nara Lokesh) దంపతుల భేటీ ముగిసింది. ఇటీవల అమరావతికి వచ్చిన ప్రధాని.. తనను ప్రత్యేకంగా కలవాలని సూచించిన విషయం తెలిసిందే. ప్రధాని ఆహ్వానం మేరకు నేరు లోకేష్ కుటుంబ సభ్యులతో కలిసి ప్రధానిని కలిసేందుకు ఢిల్లీకి వెళ్లారు. సుమారు గంటన్నరకు పైగా జరిగిన ఈ సమావేశంలో రాష్ట్రంలో తాజాగా నెలకొన్న రాజకీయ పరిస్థితులు, కూటమి పాలన, రాష్ట్ర అభివృద్ధిపై చర్చించినట్లు తెలుస్తోంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత లోకేష్ ప్రత్యేకంగా మోదీని కలవడం ఇదే తొలిసారి కావడంతో ఇరువురు ఏం చర్చించారోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది. సమావేశం ముగిసిన అనంతరం లోకేష్ దంపతులు ఆయనతో కలిసి భోజనం చేశారు.
Next Story






