- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏ-14గా లోకేశ్...జగన్ ఫ్యాక్షన్ కక్షసాధింపు అంటున్న టీడీపీ
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ స్కాంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఏ-14గా నిందితుడిగా సీఐడీ పేర్కొంది.

దిశ, డైనమిక్ బ్యూరో : అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ స్కాంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఏ-14గా నిందితుడిగా సీఐడీ పేర్కొంది. ఈ మేరకు సీఐడీ మెమో దాఖలు చేసింది. అయితే అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ స్కాంలో లోకేశ్ పేరు చేర్చడం, తదుపరి పరిణామాలపై టీడీపీ చర్చించింది. సీఎం వైఎస్ జగన్ రెడ్డి ఫ్యాక్షన్ మనస్తత్వంతో టీడీపీపై కక్ష సాధింపు రాజకీయాలకు పాల్పడుతున్నారని, ధర్మమే టీడీపీకి రక్షణగా నిలుస్తుందని ఆ పార్టీ నేతలు అన్నారు.ఢిల్లీ అశోకా రోడ్డు 50లోని ఎంపీ గల్లా జయదేవ్ కార్యాలయంలో మంగళవారం టీడీపీ ఎంపీలు, అందుబాటులో ఉన్న నేతలతో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సమావేశం అయ్యారు. చంద్రబాబు అక్రమ అరెస్టు, వైసీపీ ప్రభుత్వం పెడుతున్న తప్పుడు కేసులు,టీడీపీ న్యాయపోరాటం వంటి పలు అంశాలపై చర్చించారు. ఎటువంటి సంబంధంలేకున్నా అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఏ-14గా నారా లోకేశ్ పేరుని చేర్చుతూ ఏసీబీ కోర్టులో సీఐడీ మెమో దాఖలు చేయడంపై నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ చర్యలు కక్ష సాధింపు చర్యలు కాకపోతే ఇంకేంటంటూ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
లోకేశ్‌ను ఇరికించే కుట్ర
ఇకపోతే నారా లోకేశ్‌పేరును అమరావతి రాజధాని ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో అక్రమంగా చేర్చారని టీడీపీ ఎంపీలు ఆరోపించారు. టీడీపీ హయాంలో నారా లోకేశ్ మంత్రిగా పనిచేశారని.. కానీ రింగ్ రోడ్‌కు సంబంధించిన శాఖకు మంత్రిగా లోకేశ్ పని చేయలేదని ఎంపీలు అంటున్నారు. ఇన్నర్ రింగ్ రోడ్డుకి సంబంధించిన శాఖ కాకపోయినా... అసలు ఇన్నర్ రింగ్ రోడ్డు అనేది వేయకపోయినా, ఇందులో స్కాం అంటూ కేసు నమోదు చేయడంపై మండిపడ్డారు. అందులో ఏ 14 గా నారా లోకేశ్ పేరు చేర్చడం ముమ్మాటికీ జగన్ రెడ్డి మార్క్ ఫ్యాక్షన్ కక్షసాధింపుయేనని ఎంపీలు ఆరోపించారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఎలాంటి ఆధారాలు లేకపోయినా చంద్రబాబుని అరెస్ట్ చేసినట్లే రాబోయే రోజుల్లో లొకేశ్‌ను సంబంధమే లేని కేసులో ఇరికించాలని చూస్తున్నారని టీడీపీ ఎంపీలు ఆరోపించారు.
లోకేశ్ దిశానిర్దేశం
సీఎం వైఎస్ జగన్ తెలుగుదేశంపైనా, పార్టీ నేతలపైనా ఎన్ని కేసులు పెట్టి వేధించినా భయపడేది లేదని ఎంపీలు అన్నారు. జగన్ సర్కార్ వేధింపులకు అదరం బెదరం అని చెప్పుకొచ్చారు. ధర్మం టీడీపీ పక్షాన ఉందని, న్యాయపోరాటం ద్వారా ఎదుర్కొందాం అని ఎంపీలు తీర్మానించారు. మళ్లీ యువగళం పాదయాత్ర ప్రారంభం కానున్న నేపథ్యంలో దాన్ని కేసులతో అడ్డుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. అందులోభాగంగానే లోకేశ్‌ను నిందితుడిగా ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో చేర్చారని టీడీపీ ఎంపీలు మండిపడ్డారు. వైసీపీ అరాచక పాలనపై టీడీపీ పోరాటం చేస్తుందన్నారు. టీడీపీ తలపెట్టిన జనచైతన్య కార్యక్రమాలు ఏ ఒక్కటీ ఆగవని.. అలాగే ఎన్ని అడ్డంకులు సృష్టించినా యువగళం ఆగదని ఎంపీలు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఏపీలో జరుగుతున్న కక్ష సాధింపు రాజకీయం జాతీయ స్థాయిలో ఎండగట్టాలని, మన వైపు న్యాయం ఉంది, ఏ తప్పూ చేయలేదు అనడానికి ఆధారాలు ఉన్నాయి అని లోకేశ్ అన్నారు. వీటిని జాతీయ స్థాయిలో అందరికీ తెలిసే విధంగా పోరాడాలని లోకేశ్ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. జగన్ ప్రభుత్వం పెడుతున్న తప్పుడు కేసులు - నిజాలు వివరిస్తూ టీడీపీ తయారు చేసిన పుస్తకాలు పంపిణీ చేయాలన్నారు. ఈ పుస్తకాలపైనా, ఏపీలో వైసీపీ అరాచక పాలనపైనా జాతీయ మీడియా, జాతీయ నాయకులకి వివరించాలని ఎంపీలకు లోకేశ్ సూచించారు.
Read More..
లోకేశ్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు: అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ స్కాంలో A-14గానమోదు
Chandrababu Naidu : చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్‌పై విచారణ వాయిదా






