ఒక్క రోజులో సాధ్యం కాదు: మహిళా సాధికారతపై స్పీకర్ సంచలన వ్యాఖ్యలు

by Vemula.Srinu Prasad |

ఒక్క రోజులో మహిళా సాధికారత సాధ్యంకాదని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా సంచలన వ్యాఖ్యలు చేశారు....

ఒక్క రోజులో సాధ్యం కాదు: మహిళా సాధికారతపై స్పీకర్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: ఒక్క రోజులో మహిళా సాధికారత(Women Empowerment) సాధ్యం కాదని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా(lokhsabha speake Om Birla) సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుపతిలో జాతీయ మహిళా సాధికారత సదస్సు(National Women Empowerment Conference) జరిగింది. ఈ సదస్సులో పాల్గొన్న ఆయన మహిళలకు గౌరవం ఇవ్వాలని, అది మన సంప్రదాయమని చెప్పారు. దేశంలో ఆధ్యాత్మిక, సామాజిక ఉద్యమాల్లో మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. స్వాతంత్ర్య పోరాటంలోనూ కీలకంగా వ్యవహరించారని గుర్తు చేశారు. మహిళల భాగస్వామ్యం లేకుండా ఏ దేశమూ అభివృద్ధి చెందలేదన్నారు. సామాజిక బంధాలను ఛేదించుకుని చాలా ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించారని తెలిపారు. మహిళల కోసం రాజ్యాంగంలో చాలా నిబంధనలు రూపొందించబడ్డాయన్నారు. ప్రపంచంలోనే ముఖ్యంగా దేశంగా భారత దేశం అవతరించడానికి కారణం మహిళని స్పీకర్ పేర్కొన్నారు.

మహిళా నాయకత్వం కొన్ని శతాబద్ధాలకు ముందే మొదలైందని, చాలా రంగాల్లో అగ్రస్థానంలో ఉన్నారని చెప్పారు. ప్రస్తుత రాష్ట్రపతి ముర్ము ఆదివాసీ నేపథ్యం నుంచి వచ్చారని తెలిపారు. మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నామని స్పీకర్ ఓం బిర్లా పేర్కొన్నారు.

Next Story