మార్కాపురం జిల్లా ప్రారంభం.. కంటతడి పెట్టిన ఎమ్మెల్యే

by Vemula.Srinu Prasad |

మార్కాపురం జిల్లా ప్రారంభం కావడంతో స్థానిక ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు...

మార్కాపురం జిల్లా ప్రారంభం.. కంటతడి పెట్టిన ఎమ్మెల్యే
X

దిశ, వెబ్ డెస్క్: జిల్లాల పునర్విభజనలో భాగంగా మార్కాపురం(Markapuram) జిల్లా ఏర్పాటు అయిన విషయం తెలిసిందే. అయితే నేటి నుంచి జిల్లా ప్రారంభమైంది. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే నారాయణ రెడ్డి(Mla Narayana Reddy) కంటతడిపెట్టుకున్నారు. మార్కాపురం జిల్లా ఏర్పాటపై ఆయన భావోద్వేగానికి గురయ్యారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు(Cm Chandrababu)కు కృతజ్ఞతలు తెలిపారు. సీఎం చంద్రబాబుని తమ ఇంట్లో దేవుడిలా పూజించుకుంటామని తెలిపారు. తాము చేసిన ఉద్యమాన్ని గుర్తించి మార్కాపురంని జిల్లాగా ప్రకటించారని పేర్కొన్నారు. త్వరలోనే వెలిగొండ ప్రాజెక్టుని కూడా పూర్తి చేస్తామన్నారు. ప్రాజెక్టు పూర్తి చేసి అక్కడే చంద్రబాబు విగ్రహాన్ని కట్టిస్తానని ఎమ్మెల్యే నారాయణ రెడ్డి తెలిపారు.

Next Story