సెప్టెంబర్‌లో స్థానిక సంస్థలు ఎన్నిక‌లు... కసరత్తులు చేస్తోన్న ప్రభుత్వం...!

by Vemula.Srinu Prasad |

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై కూటమి ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి...

సెప్టెంబర్‌లో స్థానిక సంస్థలు ఎన్నిక‌లు... కసరత్తులు చేస్తోన్న ప్రభుత్వం...!
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై కూటమి ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఇందుకు అనుగుణంగా యంత్రాంగం కూడా వేగం పెంచింది. తొలు మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో పోలింగ్ పూర్తి చేయాలని భావిస్తోంది. ఈ ఎన్నికలు ముగిసిన వెంటనే గ్రామీణ ప్రాంతాల్లో రెండో విడతలో జడ్పీటీసీ (ZPTC), ఎంపీటీసీ (MPTC) స్థానాలకు ఎన్నికలు జరపాలని యోచిస్తోంది. చివరిగా గ్రామ పంచాయతీ ఎన్నికలను నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఎన్నికలను సెప్టెంబర్ నెలలోనే ప్రారంభించాలని కసరత్తులు చేస్తోంది. ఓటర్ల జాబితాల సవరణ, వార్డుల పునర్విభజన, రిజర్వేషన్ల ఖరారు వంటి కీలక ప్రక్రియలను వేగంగా పూర్తి చేసి ఎన్నికల నగారా మోగించాలని సీఎం చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రభుత్వం, అధికారుల నుంచి అధికారక ప్రకటన వస్తేనే ఎన్నికలపై క్లారిటీ వస్తుందని పలువురు రాజకీయ నేతలు అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.

Next Story