నాకు లివర్ ప్రాబ్లమ్.. సాయం చేయండి: చిన్నారి కీర్తన రిక్వెస్ట్

by Vemula.Srinu Prasad |

వినుకొండ నియోజకవర్గం నూజెండ్ల మండలం కంభంపాడుకు చెందిన తమ కుమార్తె కీర్తనకు లివర్ పాడయ్యిందని, ప్రభుత్వం ఆదుకోవాలని తల్లిదండ్రులు పల్లపాటి వీరయ్య, మరియకుమారి కోరారు...

నాకు లివర్ ప్రాబ్లమ్.. సాయం చేయండి: చిన్నారి కీర్తన రిక్వెస్ట్
X

దిశ ప్రతినిధి. నరసరావుపేట: వినుకొండ నియోజకవర్గం నూజెండ్ల మండలం కంభంపాడుకు చెందిన తమ కుమార్తె కీర్తనకు లివర్ పాడయ్యిందని, ప్రభుత్వం ఆదుకోవాలని తల్లిదండ్రులు పల్లపాటి వీరయ్య, మరియకుమారి కోరారు. సోమవారం పల్నాడు జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్‌కు వినతి పత్రం అందించారు. అనంతరం కీర్తన తల్లిదండ్రులు మీడియాతో మాట్లాడుతూ తమ కుమార్తె కీర్తనకు చికిత్స నిమిత్తం నరసరావుపేటలోని పలు హాస్పిటల్స్ తిరిగి రూ. 4 లక్షల వరకు ఖర్చు చేశామని చెప్పారు. ఇంతకుమించి వైద్యం చేయించగలిగే ఆర్ధిక స్తోమత తనకు లేదని చెప్పారు. కొంతమంది వైద్యులు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కు తీసుకెళ్లమని, సుమారు 20 లక్షల వరకు వైద్యం ఖర్చులు అవుతుందని చెప్పారని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్, ప్రభుత్వ చీఫ్ విప్ జీవి. ఆంజనేయులు, దాతలు సహాయం చేయాలని కోరారు. తన లివర్ పాడయ్యిందని, తమరు సాయం చేస్తే తాను బడికి వెళ్లి బాగా చదువుకుంటానని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు చిన్నారి వేడుకున్నారు.

Next Story