కోటప్పకొండలో ఏరులై పారిన మద్యం.. ఏకంగా పోలీస్ హోంగార్డే అమ్మకాలు

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-02-16 08:41:43  IST  )

శివరాత్రి సందర్భంగా కోటప్పకోండ తిరునాళ్లలు వైభవంగా జరిగినా ఓ హోంగార్డు చేసిన పని వల్ల రాష్ట్ర వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి..

కోటప్పకొండలో ఏరులై పారిన మద్యం.. ఏకంగా పోలీస్ హోంగార్డే  అమ్మకాలు
X

దిశ, వెబ్ డెస్క్: ‘‘కోటప్పకొండ(Kotappakonda) పరిసరాల్లో మూడు రోజుల పాటు మద్యం నిషేధం. మద్యం అమ్మొద్దు, కొనొద్దు. ఎవరైనా అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం.’’ అని కదా కలెక్టర్ చెప్పింది. కానీ జరిగిందేంటి..?. కోటప్పకొండ త్రికోటేశ్వరస్వామి(Kotappakonda Trikoteswara Swamy Temple) ఉత్సవాల్లో మద్యం ఏరులై పారింది. అమ్మింది ఎవరో కాదు.. స్వయంగా పోలీస్ డిపార్ట్ మెంట్‌కు చెందిన హోంగార్డు కోటి. ఏకంగా టెంట్ వేసి మద్యం బాటిళ్లు ఎదురు పెట్టుకుని అధిక ధరలు అమ్ముకున్నారు. మరి అతను హోంగార్డు అన్న విషయం మర్చిపోయారో.. లేదో పోలీస్ డిపార్ట్ మెంట్ సపోర్టు చేస్తుందిలే అనుకున్నారో తెలియదు గాని.. మొత్తానికి కోటప్పకొండలో మద్యం అమ్మకాలు చేసి డబ్బు సంపాదించున్నారు.

కలెక్టర్ చెప్పినా..

కానీ ఈ సీన్ చూసిన భక్తులు మాత్రం మొత్తం పోలీస్ డిపార్ట్ మెంట్‌పైనే విమర్శలు చేశారు. మూడు రోజుల పాటు మద్యం అమ్మొద్దని కలెక్టర్ చెప్పినా ఆ విషయాన్ని పట్టించుకోకుండా, పైగా అందరూ చూస్తారనే విజ్ఞత కూడా లేకుండా యదేచ్ఛగా సదరు హోంగార్డు మద్యం అక్రమాలు చేపట్టారు. దీంతో ఈ వీడియోలు లోకల్‌గానే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా సైతం వైరల్ అయ్యాయి. ఈ మేరకు ఉన్నతాధికారులు సీరియస్ అవుతున్నారట. అసలు ఆ హోంగార్డు కోటి విధులు నిర్వర్తిస్తున్నారా.. లేక మానేసి వ్యాపారం చేసుకుంటాన్నారా?, వేరే ఏదైనా కారణాలతో సస్పెండ్ అయ్యాడా అనే దానిపై ఆరా తీస్తున్నారట.

భక్తులైతే తీవ్ర విమర్శలు

మరోవైపు భక్తులైతే మాత్రం సదరు హోంగార్డుపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఎంతో భక్తి శ్రద్ధలతో కోటప్పకొండకు వచ్చిన త్రికోటేశ్వరస్వామికి పూజలు చేసి మొక్కులు తీర్చుకుంటున్న సమయంలో కొండ దగ్గరే ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడటం దారుణమని, తమ మనో భావాలను దెబ్బతీయడమేనని మండిపడుతున్నారు. ఇప్పటికైనా సరే సదరు హోంగార్డుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Next Story