- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
AP Liquor Sales : అర్ధరాత్రి 1గంట వరకు మద్యం అమ్మకాలు..ఏపీ సర్కార్ న్యూ ఇయర్ ప్రకటన
నూతన సంవత్సరం వేడుకల(New Year Celebrations)ల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం(AP Government )కీలక నిర్ణయం తీసుకుంది. మంగళ, బుధవారాల్లో అర్ధరాత్రి ఒంటి గంట(1 Am Midnight) వరకూ మద్యం విక్రయించుకునేందు(Liquor Sales)కు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ(Excise Department) అనుమతిచ్చింది.

దిశ, వెబ్ డెస్క్ : నూతన సంవత్సరం వేడుకల(New Year Celebrations)ల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం(AP Government )కీలక నిర్ణయం తీసుకుంది. మంగళ, బుధవారాల్లో అర్ధరాత్రి ఒంటి గంట(1 Am Midnight) వరకూ మద్యం విక్రయించుకునేందు(Liquor Sales)కు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ(Excise Department) అనుమతిచ్చింది. నూతన సంవత్సరం వేడుకల సందర్భంగా మద్యం అమ్మకాల సమయాన్ని పెంచాలని ఎక్సైజ్ శాఖ నిర్ణయించింది. డిసెంంబర్ 31న, జనవరి 1న మద్యం షాపులు, బార్లు, క్లబ్‌లు, ఈవెంట్లకు రాత్రి ఒంటిగంట వరకు పని చేసేందుకు అనుమతులు ఇచ్చింది. ప్రస్తుతం ప్రతి రోజూ రాత్రి 10 గంటల వరకు మద్యం అమ్మకాలకు అనుమతి ఉన్న సంగతి తెలిసిందే. కొత్త సంవత్సరం వేడుకల సందర్భంగా మద్యం అమ్మకాలకు డిమాండ్ ఎక్కువగా ఉండనున్నందునా ప్రభుత్వం మంగళ, బుధవారాల్లో రాత్రి 1గంటల వరకు అమ్మకాలకు అనుమతించింది. ఏపీ ప్రభుత్వం ఆదాయం పెంపు దిశగా ఈ నిర్ణయం ఉపకరించనుందని ఎక్సైజ్ శాఖ భావిస్తోంది.
అలాగే పోరుగు రాష్ట్రాల నుంచి మద్యం ఏపీలోకి రాకుండా ఎక్సైజ్ శాఖ ముందస్తు జాగ్రత్తలు చేపట్టింది. మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు.. దాదాపు 2 రోజులపాటు సరిహద్దుల్లోని చెక్‌పోస్టులు, బోర్డర్ మొబైల్ పెట్రోలింగ్ పార్టీలను అలెర్ట్ చేశారు. ప్రతి చెక్‌పోస్టు వద్ధ షిఫ్టుల వారీగా రాత్రీ పగలు తనిఖీలు కొనసాగించాలని ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ రాహుల్‌దేవ్ శర్మ అధికారులకు ఆదేశాలిచ్చారు. ఇప్పటికే ఏపీలో అక్టోబర్ 16 నుంచి డిసెంబర్ 29 వరకు ఈ 75 రోజులలో రాష్ట్రవ్యాప్తంగా రూ.6312 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయి. మొత్తం 83,74,116 లిక్కర్ కేసులు, 26,78,547 కేసులు బీర్ల అమ్మకాలు అయ్యాయి. అలాగే మద్యం విక్రయాలు జరిగాయి. డిసెంబర్ 30, 31.. 2025 జనవరి 1న మద్యం అమ్మకాలు మరింత భారీగా పెరుగుతాయని ఎక్సైజ్‌శాఖ భావిస్తోంది.






