- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Liquor Case: వైసీపీ MP మిథున్ రెడ్డి అరెస్ట్
ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్(AP Liquor Case)లో సంచలనం పరిణామం చోటుచేసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్(AP Liquor Case)లో సంచలనం పరిణామం చోటుచేసుకుంది. వైసీపీ కీలక నేత, రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి(MP Mithun Reddy) అరెస్ట్ చేశారు. శనివారం సుమారు ఆరు గంటల విచారణ తర్వాత సిట్ అధికారులు మిథున్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో మిథున్ రెడ్డి A4గా ఉన్నారు. ఇప్పటివరకు లిక్కర్ కేసులో 12 మంది అరెస్ట్ అయ్యారు.
కాగా, ఇప్పటికే ఎంపీ మిథున్‌రెడ్డికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలిన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన మద్యం స్కామ్ కేసులో మిథున్‌రెడ్డి ముందస్తు బెయిల్ కోసం వేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. సరెండర్‌కు కూడా సుప్రీంకోర్టు నిరాకరించింది. ఇది రాజకీయ కక్ష సాధింపు చర్య అని మిథున్ రెడ్డి వాదించినప్పటికీ కోర్టు మాత్రం బెయిల్ ఇవ్వడానికి ఒప్పుకోలేదు. చివరకు మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయడంపై వైసీపీ నేతలు ఏం విధంగా స్పందిస్తారో అని అంతా ఆసక్తి నెలకొంది.






