- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘అమరావతి’ చట్టబద్ధతకు లైన్ క్లియర్.. చట్ట సవరణకు కేంద్ర న్యాయశాఖ ఆమోదం
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి (Amaravati)కి అధికారికంగా చట్టబద్ధత కల్పించే ప్రక్రియ శరవేగంగా కొనసాగుతోంది.

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి (Amaravati)కి అధికారికంగా చట్టబద్ధత కల్పించే ప్రక్రియ శరవేగంగా కొనసాగుతోంది. ఏపీ పునర్విభజన చట్టం-2014లోని సెక్షన్ 5(2)ను సవరించి, అమరావతిని రాష్ట్ర ఏకైక రాజధానిగా ప్రకటించేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తును ప్రారంభించింది. తాజాగా కేంద్ర న్యాయ శాఖ (Central Department of Justice) ఈ సవరణ బిల్లుకు ఇప్పటికే ఆమోదం కూడా తెలిపింది. అనంతరం ఆ బిల్లు కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఆమోదించి ఇదే నెలలో పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో సవరణ బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉందని కేంద్ర వర్గాలు తెలిపాయి. పార్లమెంటు ఆమోదం పొందిన వెంటనే, అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అధికారికంగా ప్రకటిస్తూ కేంద్ర ప్రభుత్వం (Government Of India) గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. దీంతో దాదాపు ఐదేళ్లుగా స్తంభించిపోయిన అమరావతి రాజధాని చట్టబద్ధత వివాదానికి ఎండ్ కార్డు పడనుంది.
కాగా, 2019–2024 మధ్య వైసీపీ ప్రభుత్వం (YCP Government) అమలు చేసిన మూడు రాజధానుల బిల్లును ఇటీవల కూటమి ప్రభుత్వం రద్దు చేసిన నేపథ్యంలో, అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. ఎన్డీఏ (NDA) కూటమిలో భాగస్వామ్య పక్షమైన టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు ఈ అంశాన్ని ప్రధాని నరేంద్ర మోదీతో పలుమార్లు చర్చించడం కూడా ఈ ప్రక్రియలో వేగం పుంజుకున్నట్లుగా తెలుస్తోంది. అమరావతి రైతుల సుదీర్ఘ పోరాటంతో రాజధాని చట్టబద్ధతకు అడుగులు పడుతున్న వేళ ప్రజలంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు.






