రాగల రెండు గంటల్లో.. ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు

by Naga Rani Yarlagadda |

రానున్న రెండు గంటల్లో రాయలసీమ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.

రాగల రెండు గంటల్లో.. ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు
X

దిశ, వెబ్‌డెస్క్: రానున్న రెండు గంటల్లో రాయలసీమ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఆయా జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి. వైఎస్సార్ కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇదే సమయంలో గంటకు 50-60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. ప్రజలు, రైతులు ఎవ్వరూ ఈ సమయంలో చెట్లు, కరెంట్ స్తంభాలు, హోర్డింగుల వద్ద నిలబడవద్దని సూచించింది. పగలంతా మండుటెండలు, ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరవుతున్న ఏపీ ప్రజలకు.. సాయంత్రం వేళల్లో మోస్తరు వర్షాలు ఉపశమనాన్ని ఇస్తున్నాయి. గడిచిన రెండ్రోజులుగా దాదాపు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఇదే పరిస్థితి నెలకొంది.

Next Story